9, మార్చి 2023, గురువారం

పోలింగ్ విధులను సమర్థవంతంగా నిర్వహించలి: JC

 పోలింగ్ విధులను సమర్థవంతంగా నిర్వహించలి. 

  జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ 


           ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎం ఎల్ సి ఎన్నికల నిర్వహణలో భాగంగా పిఓలు,ఎ పి ఓ లు పోలింగ్ విధులను సమర్థ వంతంగా నిర్వహించేందుకు సిద్దం కావాలని జిల్లా జాయింట్  కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ఉద్బోధించారు. ఈ నెల 13 న ఎం ఎల్ సి ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులుగా నియమితులు అయిన  వారికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి రెండవ సారి శిక్షణా తరగతులు గురు వారం పి వి కె ఎన్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. 


             ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ  ప్రకాశం-నెల్లూరు- చిత్తూరు పట్టభద్రుల, ఉపాధ్యాయులు నియోజకవర్గ ఎం ఎల్ సి ఎన్నికలు మార్చి 13 న జరగ నున్నాయని,పోలింగ్ ఉదయం.8 గం. ల నుండి సాయంత్రం 4 గం. లవరకుఉంటుందన్నారు.    పోలింగ్ నిర్వహణకు ఈ నెల 12 వతేది ఉ.7 గంటల కల్లా డిస్ట్రిబ్యూషన్  కేంద్రాలైన డివిజన్ కేంద్రాలకు పి ఓ లు, ఎ పి ఓ లు,ఓ పి ఓ లు చేరుకుని పోలింగ్ మెటీరియల్ ను తీసుకొని, చెక్ లిస్టు ప్రకారము మెటీరి యల్ ఉన్నది లేనిది సరిచూసుకోవాలన్నారు. అనంతరం పిఓ,ఎపిఓ,ఓపిఓ, మైక్రో అబ్జర్వర్ అందరూ ఒక బృందంగా వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్ కు సాయంత్రంలోపు చేరుకొని రాత్రికి బస చేయాలన్నారు. పోలింగ్ కేంద్రంలో వసతులకు సంబం ధించి ప్రతి పోలింగ్  స్టేషన్ నందు బి ఎల్ ఓ లు,వీఆర్ఓ లను అనుసంధానం చేయడం జరిగిందని, వీరితో సమన్వయం చేసుకోవాలన్నారు. 

         నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ప్రిసైడింగ్ అధికారులకు ఇచ్చిన హ్యాండ్ బుక్ లోని అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలన్నారు.  ఎన్నికల నిర్వహణ రోజున బ్యాలెట్ బాక్స్ ల నిర్వహణ, బ్యాలెట్ పేపర్లు, పి ఓ డైరీ, తదితర అంశాల కు సంబంధించిన ఎటు వంటి పొరపాట్ల కు తావ్విరాదన్నారు. పోలింగ్ రోజున పోలింగ్ ఏజెంట్ లకు పాసుల పంపిణీ వారికి సీటింగ్ ఏర్పాట్లు ఉ.7 గంటలకు పూర్తి చేసి ఉ.8 గం.లకు పోలింగ్ ప్రారంభమ య్యేలా ప్రిసైడింగ్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.పోలింగ్ నిర్వహణలో భాగంగా పోలైన ఓట్లు శాతాన్ని ప్రతి గంటకు ఒకసారి రిపోర్టును అంద జేయాలన్నారు. పోలింగ్ పూర్తి అయిన అనంతరం ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి సంతకాలు తీసుకొని రెవిన్యూ డివిజన్ రిసెప్షన్ సెంటర్ స్ట్రాంగ్ రూమ్ కు బ్యాలెట్ బ్యాక్ లను చేర్చాల్సి ఉంటుందని దీనితో పాటు పి.ఓ. డైరీ ఇతర ప్రొఫార్మాలను అందజేయాలన్నారు


       ఈ శిక్షణా కార్య క్రమానికి జెడ్పి సిఈఓ ప్రభాకర్ రెడ్డి, సమగ్ర శిక్ష ఎ పి సి వెంకటరమణారెడ్డి, చిత్తూరు, నగరి, పలమనేరు, కుప్పం ఆర్ డి ఓ లు రేణుకా,సృజన,శివయ్య,పి ఓ లు,ఎపిఓ లు,పోలింగ్ సిబ్బంది తదితరులు హాజరయ్యారు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *