దొంగ ఓట్లపై విచారణ జరిపి రద్దు చేయాలి : TDP
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ తిరుపతిలో భారీగా దొంగ ఓట్లను నమోదు చేయించిందని వెంటనే విచారణ జరిపి దొంగ ఓట్లు నరికట్టాలని TDP నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం చిత్తూరులో టిడిపి నాయకులు జిల్లా ఎన్నికల సహాయ అధికారి జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు. ఆధారాలతో కూడిన దొంగ ఓట్ల జాబితాను అందజేశారు.
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiX3NPzolwR5emKFQJx7u6Se9_dGzlLDoaam7McYGlSyzI2bLRnEBODTG0XAp2sTLwzD-Fn-mZO5yGz070dEiIvwxK4CARLEoeuzgpnnIfDX7K7hscUR-Z9z-ZwgsZaTfqqikYP5rmkORs/s1600/1678454670186768-1.png)
ఈ సందర్భంగా టిడిపి నాయకులు దొరబాబు, రామానాయుడు, పులివర్తి నాని, సురేంద్ర కుమారులు మాట్లాడుతూ.. ఒక్క తిరుపతిలోనే 7వేలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని, అలాగే చిత్తూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో అధికార పార్టీ దొంగ ఓట్లను నమోదు చేసిందని ఫిర్యాదు చేశారు. చికెన్ షాప్ డోర్ నెంబర్లు 18 ఓట్లు, కాలీ ఫ్లాట్ డోర్ నెంబర్‌తో ఎనిమిది ఓట్లు ఇలా అనేక అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్లు, సంతకాలు, అధికారుల స్టాంపులు కూడా తయారు చేయడం అధికార పార్టీ అక్రమాలకు నిదర్శనం అన్నారు. దొంగ ఓట్ల నమోదుపై కేంద్రా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న దొంగ ఓట్ల పై సమగ్ర విచారణ జరిపి అరికట్టాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కోరారు.