21, మార్చి 2023, మంగళవారం

మామిడికి టన్నుకు రూ. 25 వేలు ఇవ్వాలి: TDP

 మామిడికి టన్నుకు రూ. 25 వేల గిట్టుబాటు ధర ప్రకటించాలి:TDP
JC కి వినతిపత్రం


  చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు ఒక లక్ష మంది పైగా  రైతులు మామిడిపంటపైన ఆధారపడి బతుకుతున్నారు. కేవలం రైతులే కాకుండా మామిడిపంటపైన ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు పది లక్షల మంది ఆధారపడి బతుకుతున్నారు. వర్షాభావ పరిస్థితులు, నీటి సమస్య కారణంగా ప్రతి సంవత్సరం  మామిడి పంట విస్తృతంగా పెరుగుతుంది. ప్రకృతి వైపరీతంగా తట్టుకొని ఎంతో శ్రమకు ఓర్చి, పంట చేతికొచ్చే సమయానికి గిట్టుబాటు ధర పూసే ఉండదు. ఒకవేళ పంట బాగా పండితే గిట్టుబాటు ధర ఉండదు. ధరలుంటే పంటలు ఉండదు. ఇన్ని దాటుకుని మామిడి పంటని సాగుచేసి ఒక దశకు తీసుకొస్తే ఫ్యాక్టరీలు యజమానులు అందరూ కూడా సిండికేట్ అయ్యి రైతుల జీవితాలతో చెలగాటమాడుకుంటున్నారు. ఒకాయనొక దశలో రైతు రాత్రనకుండా పగలనకుండా కష్టపడి పంటను పండిస్తే జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యం అందరూ సిండికేట్ అయ్యి  5000/-రూ కి ఇస్తావా లేక 10000/-రూ కి ఇస్తావా అని రైతుల్ని బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితికి వస్తున్నారు. రైతు   కన్నీరు పెడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో రైతుని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనుంది. కావున మామిడి రైతుకు టన్నుకు  25000/-రూ గిట్టుబాటు ధర ప్రకటించాలని తెలుగుదేశం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.

 
 ముఖ్య డిమాండ్లు 
1)మామిడి పంటకు టన్ను 25000 గిట్టుబాటు ధర కల్పించి రైతులని కాపాడాలి
 2)జ్యూస్ ఫ్యాక్టరీలు సిండికేట్ అవుతున్న విషయాన్ని గమనించి అటువంటి యజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి
 3)ప్రభుత్వం ప్రకటించినట్లుగా జిల్లాకు ఒక మామిడి బోర్డును ఏర్పాటు చేయాలి 
4)మండీలలో ఎలక్ట్రానిక్ కాటాలను ఏర్పాటు చేయాలి 5)రైతాంగం విశ్రాంతి తీసుకోవడానికి మండీల వద్ద వసతి కల్పించాలి
6) ప్రతి మామిడి మండిలోనూ కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకునే వెసులుబాటు కల్పించాలి
7) జిల్లాలో మామిడి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి 8)ముఖ్యంగా దళారీల బారి నుండి రైతులను కాపాడాలి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్,  కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్, జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు మేషాక్ ,జిల్లా వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడు సునీల్ కుమార్ చౌదరి, సెట్టేరి సర్పంచ్ అనిల్ చౌదరి,  తెలుగుదేశం పార్టీ నాయకులు మధు కుమార్ యాదవ్,బాబు నాయుడు,కృష్ణమూర్తి యాదవ్, వాసుదేవ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *