చీటింగ్ కేసులో ముద్దాయికి ఆరు నెలలు జైలు శిక్ష
చీటింగ్ కేసులో ముద్దాయికి ఆరు నెలలు జైలు శిక్ష
ఓ అమ్మాయిని నమ్మించి మోసం చేసిన కేసులో కార్మిక శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న సుధీర్ కుమార్ కు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి కే. రవి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చారు.
వివరాల మేరకు కార్మిక శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న సుధీర్ కుమార్ ఐరాల మండలం పేరయ్యగారి పల్లెకు చెందిన ఓ యువతిని నమ్మించి మోసం చేశాడు. ఈ మేరకు బాధితురాలు స్థానిక ఐరాల పోలీస్ స్టేషన్లో 2016 లో ఫిర్యాదు చేసింది. సుధీర్ కుమార్, ధనలక్ష్మి ,మురళీమోహన్ రాజశేఖర్ పై 420 కేసు నమోదు చేశారు. 2014 నాటి నుండి పది సంవత్సరాలు పాటు విచారించిన ఎక్సైజ్ కోర్టు నేరం నిరూపణ కావడంతో ముద్దాయిగా ఉన్న టి సుధీర్ కుమార్ కు 6 నెలలు జైలు శిక్ష విధించారు. ఆ;అలాగే ఈ కేసులో మరో ముగ్గురు ముద్దాయిలకు 2000 రూపాయల జరిమానా విధిస్తూ ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి కే రవి శుక్రవారం తీర్పును వెలువరించారు.