MLC ఎన్నికల్లో TDP అభ్యర్థి అనురాధ గెలుపు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం
అనూహ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ గెలుపొందారు. 23 ఓట్లతో పంచుమర్తి అనురాధ గెలుపు సాధించారు. వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తుంది.
ఎమ్మెల్సీగా విజయం పై నారా లోకేష్ కామెంట్స్...
ఎమ్మెల్సీగా విజయం సాధించిన విజయవాడ మాజీ మేయర్, చేనేత ఆడపడుచు, మా తెలుగుదేశం కుటుంబ సభ్యురాలు పంచుమర్తి అనూరాధకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
మేము 23 సీట్లే గెలిచామని ఎద్దేవ చేశావు. అందులో నలుగురిని సంతలో పశువుల్లా కొన్నావు. చివరికి అదే 23వ తేదీన, అదే 23 ఓట్లతో నీ ఓటమి-మా గెలుపు. ఇది కదా దేవుడు స్క్రిప్ట్ అంటే జగన్ అని ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్సీలుగా గెలుపొందిన అభ్యర్దులు
1). వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీలు...
1). మర్రి రాజశేఖర్ 22 ఓట్లు
2). సూర్యనారాయణ రాజు 22 ఓట్లు.
3). జయమంగళ వెంకట రమణ 21 ఓట్లు.
4). కోలా గురువులు 21 ఓట్లు.
5). బొమ్మి ఇజ్రాయిల్ 22 ఓట్లు.
6). పోతుల సునీత 22 ఓట్లు.
7). యేసు రత్నం 22 ఓట్లు.
2). టీడీపీ ఎమ్మెల్సీ
1). పంచుమర్తి అనురాధా 23 ఓట్లు.