అవినీతికి అడ్డాగా మండల రెవెన్యూ కార్యాలయాలు! TDP
అవినీతికి అడ్డాగా మండల రెవెన్యూ కార్యాలయాలు!
.... టిడిపి నాయకుల ఆరోపణ
చిత్తూరు జిల్లాలో మండల రెవిన్యూ కార్యాలయాలు అన్ని కూడా అవినీతికి అడ్డాగా తయారై, డబ్బులు లేకుండా పని చేయడం లేదని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఆరోపించారు. గురువారం చిత్తూరులో విలేకరులతో మాట్లాడుతూ వీఆర్వోలు నుండి ఉన్నతాధికారి వరకు లంచాల కోసం ప్రజలను వేధిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల రెవిన్యూ లో అధికారులు ఏసీబీకి పట్టుబడటం చూస్తుంటే రెవెన్యూ సేవలు అన్ని కూడా అవినీతి మయం అయిపోయిందన్నారు.
డబ్బులు లేకుండా ఏ పని కూడా జరగని పరిస్థితి కనిపిస్తోంది. పరిపాలనకి గుండెకాయ లాంటి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సి సెక్షన్ తో పాటు ఇతర సెక్షన్ల లో అవినీతి తిమింగలాలు రాజ్యమేలుతున్నారు. ముఖ్యంగా పెట్రోల్ బంకు లు లైసెన్సులు, గ్యాస్ ఏజెన్సీ లైసెన్సులు, ఎస్సీ ఎస్టీ అత్యాచారాం కు సంబంధించినటువంటి ,ఎస్సీ ఎస్టీ ఫండ్స్ సంబంధించిన ఏ ఫైల్ అనుమతి పొందాలన్నా చేతులు తడపాల్సిందే. ఈ అవినీతి తిమింగలాల వలన సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేరుకె టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నప్పటికీ కూడా, ఈ టోల్ ఫ్రీ నెంబర్లకి ఫోన్ చేస్తే స్పందించే నాధుడు లేదు. ఇటీవల జరిగిన ఏసీబీ దాడులు, ఏసీబీలో దొరికినటువంటి రెవెన్యూ అధికారుల జాబితా రోజురోజుకి పెరుగుతుంది. మండల కార్యాలయాలు అంటేనే ప్రజల హడలిపోతున్నారు. పూర్తిగా పర్యవేక్షణ లోపం, కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. ఈ యొక్క సమావేశంలో టిడిపి కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ ,బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్, వాణిజి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు సునీల్ చౌదరి, చిత్తూరు రురల్ పార్టీ ప్రెసిడెంట్ శశికర్ బాబు, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు రాజా తదితరులు పాల్గొన్నారు.