చాట్ దుకాణం మూసివేత...!
చాట్ దుకాణం మూసివేత...!
చాట్ దుకాణంలో బూజు పట్టిన బ్రెడ్ వినియోగిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోలపై నగర కమిషనర్ డా. జె అరుణ స్పందించారు. సదరు చాట్ దుకాణాన్ని తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని నగరపాలక ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు.
కమిషనర్ ఆదేశాలతో ఎంహెచ్వో డా. లోకేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య సోమవారం గిరింపేట రిలయన్స్ మార్ట్ వద్దనున్న బాలాజీ చాట్ దుకాణాన్ని తనిఖీ చేశారు. నాణ్యత కలిగిన, తాజా ఆహార పదార్థాలనే వినియోగదారులకు అందించాలని హెచ్చరించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని హెచ్చరిస్తూ చాట్ దుకాణాన్ని మూయించారు. నగరంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, ఇతర తినుబండారాల దుకాణాల్లో ప్రమాణాల మేరకు శుభ్రత పాటించాలని, దాన్ని మీద ఆహార పదార్థాలను వినియోగించాలని, నేను పక్షంలో సదరు దుకాణాల ట్రెడ్ లైసెన్తులను రద్దు చేయడంతో పాటు, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ డా. జె అరుణ హెచ్చరించారు.