పండగ పూట క్లాప్ ఆటో డ్రైవర్లకు పస్తులు : AITUC
పండగ పూట క్లాప్ ఆటో డ్రైవర్లకు పస్తులు
AITUC జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్. నాగరాజు తీవ్ర విమర్శ
చిత్తూరు నగరపాలక సంస్థలో ఇంటింటా తడి చెత్త, పొడి చెత్త సేకరించడానికి క్లాప్ ఆటో డ్రైవర్లను ప్రభుత్వం రెడ్డి ఎంటర్ప్రైజెస్ అనే సంస్థకు కాంట్రాక్ట్ విజయవాడకు ఇస్తే రెడ్డి ఎంటర్ప్రైజెస్ సంస్థ యాజమాన్యం కార్మికులను ఉగాది పండగ పూట వస్తులతో పెట్టి కడుపు కాల్చడం సరైన పద్ధతి కాదని ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్. నాగరాజు వాపోయారు. రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉగాది పండగ చేసుకుంటా ఉంటే, రెడ్డి ఎంటర్ప్రైజెస్ సంస్థలో పనిచేస్తున్న క్లాప్ ఆటో డ్రైవర్లు పండగపూట వస్తులతో కుటుంబాన్ని ఉంచడం బాధాకరం మన్నారు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి చిత్తూరు నగరంలో ఇంటింటా తిరిగి చెత్తను సేకరిస్తూ, చేస్తున్న ఆటో డ్రైవర్ల ఎలా బ్రతకాలని రెడ్డి ఏజెన్సీని కాంట్రాక్టర్ ను సూటిగా ప్రశ్నించారు. ప్రతి నెల సక్రమంగా జీతాలు చెల్లించాలని అనేకసార్లు మొరపెట్టుకున్న రెడ్డి ఎంటర్ప్రైజెస్ సంస్థ యాజమాన్యంలో మార్పు లేదన్నారు.ఇప్పటికైనా క్లాప్ ఆటో డ్రైవర్ల బాధలను అర్థం చేసుకొని ప్రతి నెల జీతం సక్రమంగా ఇవ్వాలని, పిఎఫ్ ,ఈఎస్ఐ క్లాప్ ఆటో డ్రైవర్లకు అమలు చేస్తున్నారా? లేదా? అని ప్రశ్నించారు. క్లాప్ ఆటో డ్రైవర్లకు గుర్తింపు కార్డు, యూనిఫారం, పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు అజీమ్ భాష, గిరి బాబు, బాలాజీ, హేమచంద్ర, మొగిలి ఈశ్వర్, పృద్వి తదితరులు పాల్గొన్నారు.