20, మార్చి 2023, సోమవారం

బేడ, బుడగ జంగం కులస్థులకు SC సర్టిఫికెట్లు ఎప్పుడు?

 బేడ, బుడగ జంగం కులస్థులకు SC సర్టిఫికెట్లు ఎప్పుడు?
 TDP MLA డాక్టర్ నిమ్మల రామానాయుడు నిరసన

      బేడ, బుడగ జంగం కులస్థులకు ఎస్సీ సర్టిఫికెట్లు ఎప్పుడు ఇస్తారంటూ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు,  శాసనసభ పక్ష ఉపనేత, డాక్టర్ నిమ్మల రామానాయుడు.. సచివాలయంలోని అగ్నిమాపక కేంద్రం వద్ద ప్లకార్డుతో గంటన్నర పాటు నిలబడి నిరసన వ్యక్తం చేశారు.   జీవనోపాధి లేక విద్య ఉద్యోగాలు పథకాలు అందని బేడ, బుడ్గ జంగం సమస్యలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదని నిలదీశారు. 

      కుల సర్టిఫికెట్లు అందక జీవించే హక్కు, నివసించే హక్కు, విద్యా హక్కులను బేడ, బుడ్గ జంగం కులస్తులు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. "ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరచి.. గతంలో జగన్మోహన్​ రెడ్డి గారు బేడ, బుడ్గ, జంగం కులస్తులకు ఏవైతే హామీలు ఇచ్చారు.. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజునే ఎస్సీ సర్టిఫికెట్లు అందజేస్తానని మీరు మాట ఇచ్చారో.. ఈ రోజు అధికారంలోకి వచ్చాక మాట తప్పి.. మడం తిప్పి బేడ, బుడ్గ, జంగం కులస్తులు అంటే ఎవరో తెలియని విధంగా ఈ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం కళ్లు తెరిపించే విధంగా బేడ, బుడ్గ, జంగం కులస్తుల తరపున తెలుగుదేశం పోరాడుతుంది." అని డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *