అసత్య ఆరోపణలు చేయకండి: శ్రీకాళహస్తి పాలకమండలి చైర్మన్
అసత్య ఆరోపణలు చేయకండి శ్రీకాళహస్తి ప్రజలు క్షమించరు
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పాలకమండలి చైర్మన్
శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలోని అనుబంధ ఆలయాల పవిత్రత భావాన్ని దెబ్బతీసే విధంగా అసత్య ఆరోపణలతో రాజకీయ పబ్బం గడపకోవద్దు అని తెలుగుదేశం నాయకుడు సుధీర్ రెడ్డికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు హితవు చెప్పారు.ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలపై బురదజల్లే కుహనా రాజకీయాలకు తెలుగుదేశం నాయకుడు బొజ్జల సుధీర్ రెడ్డి స్వస్తి పలకాలని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు కోరారు.ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పై అసత్య ఆరోపణలు చేయడం తగదని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలోని , కాణిపాక ఆలయాల్లో ప్రమాణం చేయడానికి ముందుకు రావాలని డిమాండ్ చేశారు. భగవంతుని సేవలో నీతి నిజాయితీ ధర్మబద్ధంగా ధర్మకర్తల మండలి నడుచుకుంటుందని, ప్రతి పైసాకు జవాబుదారుతనంగా వ్యవహరిస్తున్నాం అని స్పష్టం చేశారు. కాళహస్తి పరువు తీసేలా వ్యవహరించే వద్దని సుధీర్ రెడ్డికి హితవు చెప్పారు.
శ్రీకాళహస్తి దేవస్థానంలో సమావేశ మందిరం హాల్లో ధర్మకర్తల మండలి సభ్యులతో కలసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం నాయకుడు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రసన్న వరదరాజు స్వామి విగ్రహం కింద బంగారు నాణ్యాలు ఎన్ని లభించాయి? వాటిలో కొన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తీసుకువెళ్లి హైదరాబాదులో అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు చేయడానికి ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు తీవ్రంగా ఖండించారు. వరదరాజుల స్వామి గుడి పునర్నిర్మాణ పనులు రాష్ట్ర స్థపతి సూచనల మేరకే పూర్తిస్థాయిలో చేపట్టడం జరిగిందని తెలిపారు. మూలవిరాట్ తొలగింపు 13వ తేదీనే విస్తృత ప్రచారం చేశామని, ఆల్ పార్టీలకు మఠాధిపతులకు, ధార్మిక సంస్థలకు సమాచారం ఇచ్చామని తెలిపారు.
17 తేదీన భక్తులు, పుర ప్రముఖులు, పట్టణ ప్రజలకు ధర్మకర్తల మండలి ,అధికార యంత్రాంగం సమక్షంలో తొలగింపు చేసి పంచనామా చేసినట్లు తెలిపారు. సిసి కెమెరాలతో పర్యవేక్షణ చేయడం జరిగిందని తెలిపారు. ఆ సమయంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అసెంబ్లీలో ఉన్నారు, అయినా ఆయన ఇక్కడ ఉన్నట్లు ఆరోపణలు చేయడం తగదన్నారు. సుధీర్ రెడ్డికి పంచనామా పత్రం సిసి ఫుటేజీలు అన్ని ఇస్తామని పరిశీలన చేసుకోవచ్చని, తన వద్ద ఆధారాలు ఉన్నాయన్న బొజ్జల సుధీర్ రెడ్డి ఆధారాలు బయటపెట్టి శ్రీకాళహలయంలో దక్షిణామూర్తి వద్ద గాని కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడి వద్ద గాని ప్రమాణం చేయడానికి ఎప్పుడైనా సరే ముందుకు రావాలని సవాల్ విసిరారు.
పస్తులు ఉండడానికైనా సిద్ధమే కానీ దేవుడు సొత్తు రూపాయి తినే బతుకు తాము బతకమని, శ్రీకాళహస్తి వాసి గా శ్రీకాళహస్తి పరువు ప్రతిష్టలు కాపాడాల్సిన సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి పరువు తీసేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బంగారు నాణ్యాలు అమ్ముకొని బతికే స్థితిలో లేరని 10 మందికి దానధర్మాలు చేస్తే స్థితిలో ఉన్నారని అసత్య ఆరోపణలతో కుటిల రాజకీయాలతో వ్యవహరిస్తే శ్రీకాళహస్తి ప్రజలు క్షమించరనేది గుర్తుపెట్టుకోవాలని హితవు చెప్పారు.
గతంలో దేవుడు సొత్తు తినింది ఎవరనేది ఊరువాడా ప్రచారం జరిగింది ఎవరు పైన సుధీర్ రెడ్డి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సభ్యులు పసలు సుమతి మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా ఎక్కడ లేని విధంగా మా శాసనసభ్యులు మరియు పాలకమండలి చైర్మన్ దేవస్థానం సంబంధించిన అనుబంధ ఆలయాలని అన్నిటిని పూర్వవైభవం తీసుకొచ్చేదానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు మీ ఊరందూరు గ్రామంలో వెలిసి ఉన్న 40 లక్షలతో నీలకంఠేశ్వర ఆలయ ఆధునీకరణ పనులు భూమి పూజ చేసి తెలియజేశారు. జయ శ్యాం, మాట్లాడుతూ శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారిని పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు గారిని విమర్శిస్తే ప్రజలే మీకు గుణపాఠం చెబుతారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు బుల్లెట్ జయ శ్యాం, పసల సుమతి, కొండూరు సునీత, రమాప్రభ, లక్ష్మి. ప్రత్యేక ఆహ్వాన సభ్యులు చింతామణి పాండు, పట్టణ ప్రముఖులు కొండూరు నంద,భాస్కర్ ముదిరాజ్,సెన్నేర్ కుప్పం శేఖర్, లక్ష్మీపతి,తదితరులు పాల్గొన్నారు.