వాహనంతో సహా ఎర్రచందనం దుంగలు స్వాధీనం
వాహనంతో సహా ఎర్రచందనం దుంగలు స్వాధీనం
అన్నమయ్య జిల్లా పీలేరు ఎఫ్ ఆర్ ఓ ఎన్ వెంకటరమణకు వచ్చిన అత్యంత రహస్యమైన సమాచారం మేరకు మంగళవారం ఉదయం 4 గంటల నుంచి కాపు కాచి ఉండగా 5:30 గంటలకు ప్రాంతంలో రొంపిచర్ల మండలం బొమ్మయ్య గారి పల్లి పంచాయతీ జమ్మికుంట వద్ద ఎఫ్ ఆర్ ఓ ఎన్ వెంకటరమణ తమ సిబ్బందితో కాపుగాచారు. అటుగా వస్తున్న వాహనాన్ని ఆపగా, అప్రమత్తమైన ముద్దాయిలు కారు ఆపి అందులో నుంచి దూకి పారిపోయారు. కారును గమనించగా అది టయోటా ఇటియోస్ అందులో ఐదు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలు తూకం వేయగా 175 కిలోలు ఉన్నవి. కారుతో సహా ఎర్రచందనం దుంగలు 10 లక్షల విలువ అని అన్నారు. పారిపోయిన ముద్దాయిల గురించి గాలింపు జరుగుతోందని త్వరలో పట్టుకొని తదుపరి చర్యలు తీసుకుంటామని ఎఫ్ ఆర్ వో ఎన్ వెంకటరమణ తెలిపారు.