పోలవరం ఎత్తు తగ్గిస్తే మూల్యం చెల్లించాల్సిందే.!
పోలవరం ఎత్తు తగ్గిస్తే మోడీ, జగన్ భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
ఎస్.నాగరాజన్, టి.. జనార్ధన్ ల హెచ్చరిక.
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణంలో చాచి వేత ధోరణి ప్రదర్శిస్తూ, నేడు ఎత్తు తగ్గించి రాయలసీమ ప్రజానీకానికి నీటి కరువును సృష్టిస్తున్న ప్రధాని మోడీ ,ముఖ్యమంత్రి జగన్ లు ప్రజల చీత్కారానికి గురిగాక తప్పదని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్ .నాగరాజన్, సహాయ కార్యదర్శి టి. జనార్దన్ లు హెచ్చరించారు. సిపిఐ రాష్ట్ర సమితి మేరకు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడాన్ని నిరసిస్తూ సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన దీక్షలు చేపట్టారు.
ఈ సందర్భంగా నాగరాజ్, జనార్దన్లు మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్రమే నిర్మాణం చేపట్టి ఐదు సంవత్సరాల లోపు పూర్తి కావల్సి వుండగా నేటికి నత్తనడకన సాగడం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంలో అలసత్వం, రాష్ట్ర ప్రభుత్వం కేసులకు భయపడి గట్టిగా నిలదీయలేకపోవడంతో నే ప్రాజెక్టు కుంటుపడుతోందని పేర్కొన్నారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో త్వరిత గతిన పూర్తిస్థాయిలో చేపట్టాల్సిన ప్రాజెక్టును హఠాత్తుగా నేడు 150 అడుగుల ఎత్తు నుండి 130 కు తగ్గించడం వల్ల ఈ ప్రాజెక్టు ఉనికే కోల్పోతుందని తెలిపారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గితే జాతీయ ప్రాజెక్టు, కేవలం రిజర్వాయర్ గా మారి నీటి సరఫరా లేక రాయలసీమకు, ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టుల వల్ల భూములు ,ఇల్లు కోల్పోయిన నిర్వాసితులను ఆదుకునేందుకు సైతం ముందుకు రాకపోవడం పేద ప్రజలు అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లెక్క లేని తనం గా మారిందని వాపోయారు . కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల మొదటి నుండి వివక్ష కొనసాగిస్తుందని దానికి పరాకాష్టగా నేడు పోలవరం ఎత్తు తగ్గించే కుట్ర లు పన్ను తోందని దయ్యబట్టారు. రాష్ట్రం నుండి గెలిచిన ఎంపీలు పార్లమెంట్లో నోరు మెదపక పోవడం పైపెచ్చు కేంద్రానికి అన్ని విషయాల్లో లొంగిపోవడం వల్లనే రాష్ట్రం అన్ని రంగాలలో దయనీయంగా ఉందని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం తగ్గించే ఆలోచన మానుకొని యధావిధిగా కొనసాగించాలని, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని లేనిచో భవిష్యత్తులో ప్రజల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ నిరసన దీక్ష కార్యక్రమంలో చిత్తూరు పట్టణ కార్యదర్శి వి. సి గోపీనాథ్ , మణి,సత్యమూర్తి,జిల్లా కార్యవర్గ సభ్యులు మద్దెల సుబ్రహ్మణ్యం, దాసరి చంద్ర, జీ.డి నెల్లూరు కార్యదర్శి మార్కండేయులు, ఐరాల మండలం నాయకులు సంగీతం గుర్రప్ప, బంగారు పాల్యం మండల నాయకులు రామమూర్తి, ఇరాల మండల నాయకులు హరినాథ్,రఘు , బాలజిరావు, జయలక్ష్మి విజయ గౌరీ, జమీలబి, రమాదేవి ,కుమారి, నాగమ్మ,గోవిందమ్మ ,బాలాజీ రావు, రమేష్ ,వెంకటేశు నాయుడు, శివ, తదితరులు పాల్గొన్నారు.