3వ విడత YSR ఆసరా నిధులు విడుదల
మహిళా సంక్షేమానికి పెద్దపీట
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, వారి ఆర్ధిక స్వావలంబన కు కృషి చేస్తున్నాదని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మాత్యులు డా. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. మూడవ విడత వై ఎస్ ఆర్ ఆసరా కార్యక్రమం భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 7.98 లక్షల మహిళా సంఘాలలోని 78.94 లక్షల అక్క చెల్లెమ్మలకు లబ్ది చేకూరేలా రూ.6,419.89 కోట్లు నేరుగా మహిళా సంఘాల పొదుపు ఖాతాలలో జమచేసే కార్యక్రమాన్ని నేడు ఏలూరు జిల్లా దెందులూరు నుండి బటన్ నొక్కి రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.
చిత్తూరు జిల్లా కేంద్రంలో మూడవ విడత వై ఎస్ ఆర్ ఆసరా జిల్లా స్థాయి కార్యక్రమం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ భవన్ సమావేశ మందిరంలో నిర్వహించగా,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మాత్యులు డా. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్. రెడ్డప్ప, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్..., విచ్చేయగా డి ఆర్ ఓ ఎన్. రాజశేఖర్, గౌ.రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ సురేష్, రాష్ట్ర ఎపిఎస్ ఆర్ టి సి వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి, ఎన్ ఆర్ ఈజి ఎస్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ విశ్వనాధ్, చిత్తూరు నగర మేయర్ ఆముద, పలమనేరు - కుప్పం- మదనపల్లె అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి యాదవ్, చిత్తూరు నగర డిప్యూటి మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, చిత్తూరు ఆర్డిఓ రేణుక, డి ఆర్డిఎ పిడి తులసి, మెప్మా పిడి రాధమ్మ, జెడ్పి సీఈఓ ప్రభాకర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, లబ్దిదారులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భ గనుల శాఖ మాత్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, వారి ఆర్ధిక స్వావలంబన కు కృషి చేస్తున్నదనన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా ప్రబలిన రెండు సంవత్సరాల సమయంలో కూడా పేదలకు అండగా నిలిచి నవరత్నాల పథకాల ద్వారా ఆర్ధిక లబ్ధిని చేకూర్చిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డిదే అని తెలిపారు. సుధీర్గ పాదయాత్ర లో ప్రజల కష్టాలను చూసి ఎన్నికల మ్యానిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ లా భావించి ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికల హామీలను 98.5 % అమలు చేసిన ఘనత జగన్ ప్రభుత్వంకే దక్కుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం అమ్మఒడి, వై.యస్.ఆర్ ఆసరా, రైతు భరోసా, జగనన్న చేయూత వంటి పథకాలను అమలు చేయడమే కాకుండా మాట ఇవ్వని కొత్త పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు. నేడు 3వ విడత వై.యస్.ఆర్ ఆసరా క్రింద రాష్ట్ర వ్యాప్తంగా 7.98 లక్షల మహిళా సంఘాలలోని 78.94 లక్షల అక్క చెల్లెమ్మలకు లబ్ది చేకూరేలా రూ.6,419.89 కోట్లు నేరుగా మహిళా సంఘాల పొదుపు ఖాతాలలోకి ముఖ్యమంత్రి జమ చేసారని తెలిపారు.
చిత్తూరు ఎంపి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి మహిళల పక్షపాతి అని, ఎన్నికల పాదయాత్ర సమయం లో మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను మ్యానిఫెస్టోలో పొందుపరచి వాటిని అమలుపరచడం లో ముఖ్యమంత్రి నిరంతరం తపిస్తున్నారని తెలిపారు. నేడు 3వ విడత వై.యస్.ఆర్ ఆసరా పథకం ద్వారా మహిళలకు లబ్ధి చేకూరడం జరుగుతున్నదని తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేయడం జరుగుతున్నదని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని,మహిళా సాధికారత మరింత మెరుగుపడి, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని ఎస్ హెచ్ జి లలోని మహిళల యొక్క ఆర్ధిక పురోగతికి దోహదపడాలనే ఉద్దేశ్యం తో రాష్ట్ర ప్రభుత్వం వై.యస్.ఆర్ ఆసరా పథకం ను రూపొందించిందని తెలిపారు. ఈ పథకం ద్వారా 3 విడతల్లో జిల్లాలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతానికి చెందిన 3,11,236 మంది ఎస్ హెచ్ జి మహిళా లబ్దిదారులకు రూ.974.12 కోట్లు వారి పొదుపు ఖాతాలకు జమ చేయడం జరిగిందని తెలిపారు. ఈ పథకం ద్వారా వచ్చే లబ్దితో పేద మహిళలు బాధ్యతాయుతంగా వ్యవహరించి వారి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవాలని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. చిత్తూరు నగర మేయర్ మాట్లాడుతూ తన ఎన్నికల పాదయాత్రలో పేద మహిళలు ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ముఖ్యమంత్రి వారికి ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలు చేస్తున్నారని, ఇందులో భాగంగా మహిళలకు అండగా వై.యస్.ఆర్ ఆసరా, సున్నా వడ్డీ, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి, జగనన్న చేదోడు వంటి పథకాలను ప్రవేశ పెట్టారని తెలిపారు. సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టి ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసారని తెలిపారు. మహిళలు ఇంటి అవసరాలకు, త్రాగునీటికి ఇబ్బందులు పడకూడదనే ఇద్దేశ్యం తో ఇంటింటికి కుళాయి కనెక్షన్ లు ఇవ్వడం జరుగుతున్నదని తెలిపారు.
3 వ విడత వై యస్ ఆర్ ఆసరా పథకం కింద డి ఆర్డిఎ ద్వారా జిల్లా లోని 7 నియోజకవర్గాలలోని మొత్తం 29,288 యస్ హెచ్ జి సంఘాలకు చెందిన 2,70,485 మంది సభ్యులకు గాను రూ. 284 కోట్లు లబ్ది చేకూరనుంది.
నియోజకవర్గాల వారిగా వివరాలు...
చిత్తూరు నియోజకవర్గం లోని 1,335 యస్ హెచ్ జి సంఘాలకు చెందిన 12,247 మంది సభ్యులకు రూ. 11.72 కోట్లు
గంగాధర నెల్లూరు నియోజకవర్గం లోని 5,323 యస్ హెచ్ జి సంఘాలకు చెందిన 49,720 మంది సభ్యులకు రూ. 53.38 కోట్లు
కుప్పం నియోజకవర్గం లోని 4,699 యస్ హెచ్ జి సంఘాలకు చెందిన 45,707 మంది సభ్యులకు రూ. 43.69 కోట్లు
నగరి నియోజకవర్గం లోని 1,957 యస్ హెచ్ జి సంఘాలకు చెందిన 18,428 మంది సభ్యులకు రూ. 18.67 కోట్లు
పలమనేరు నియోజకవర్గం లోని 5,178 యస్ హెచ్ జి సంఘాలకు చెందిన 47,366 మంది సభ్యులకు రూ. 48.29 కోట్లు
పుంగనూరు నియోజకవర్గం లోని 4,977 యస్ హెచ్ జి సంఘాలకు చెందిన 43,968 మంది సభ్యులకు రూ. 47.19 కోట్లు
పూతలపట్టు నియోజకవర్గం లోని 5,819 యస్ హెచ్ జి సంఘాలకు చెందిన 53,049 మంది సభ్యులకు రూ. 61.06 కోట్లు
3 వ విడత వై యస్ ఆర్ ఆసరా పథకం కింద జిల్లా లోని పట్టణ పరిధిలో మెప్మా ద్వారా 4,427 యస్ హెచ్ జి సంఘాలకు చెందిన మొత్తం 39,842 మంది యస్ హెచ్ జి సభ్యులకు గాను రూ. 40.28 కోట్లు లబ్ది చేకూరనుంది.