27, మార్చి 2023, సోమవారం

నాడు చించివేసిన ఆర్డినెన్సు నేడు రాహుల్ కొంప ముంచిందా?

విధిరాత తప్పదులే - ఎదురీత ఆగదులే
నాడు చించివేసిన ఆర్డినెన్సు నేడు రాహుల్ కొంప ముంచిందా? 

               ఆ ఆర్డినెన్సు ను అప్పుడు రాహుల్ గాంధీ అలా చించకుండా ఉండిఉంటే ఈ రోజు రాహుల్ కు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నేరస్తులు పార్లమెంట్ లో ఒక్క రోజు కూడా ఉండకూడదని ఆ రోజు రాహుల్ గాంధీ భావించి చించి వేసిన ఆర్డినెన్సు అలానే ఉండి ఉంటే పరిస్థితి వేరుగా ఉంటేది. రాహుల్ గాంధీ MPగా కొనసాగేవారు. తను చించి వేసిన ఆర్డినెన్సు కారణంగా తానే బలి అవుతానని ఆ రోజు రాహుల్ ఉహించలేదు. అందుకే పెద్దలు అంటారు విధి రాతను ఎవ్వరూ తప్పించుకోలేరని. కాలం కలిసి రానప్పుడు ఏటికి ఎదురు ఈదటం తప్పదని. రాహుల్ చించి వేసిన ఆ ఆర్డినెన్సు గురించి తెలుసుకోవాలి అంటే ఈ వార్తను పూర్తిగా చదవాల్చిందే.
       
              2013 లో సొంత ప్రభుత్వం యూపీఏ (UPA) తీసుకువచ్చిన ఒక ఆర్డినెన్స్ ను రాహుల్ గాంధీ చించేశారు. అది అర్థంలేని ఆర్డినెన్స్ అంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీ నాడు అనాలోచితంగా చేసిన ఆ చర్యే ఇప్పుడు ఆయన కొంప ముంచిందని అంటున్నారు.  రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వార్త ఇప్పడు సంచలనంగా మారింది. ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ, మోదీ ఇంటిపేరున్న వారంతా దొంగలే అనే అర్థమొచ్చేలా రాహుల్ గాంధీ (Rahul Gandhi) 2019లో చేసిన ఒక వ్యాఖ్య ఆయన అనర్హతకు కారణమైంది. అయితే, ఈ తక్షణ అనర్హత నిబంధన వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది.

 సుప్రీంకోర్టు తీర్పు
       లిలి థామస్, లోక్ ప్రహారీ కేసుల్లో సుప్రీంకోర్టు  వరుసగా 2013, 2018 లో ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సంబంధించి ఒక కీలక తీర్పును వెలువరించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం  లోని ఒక సెక్షన్ ను ఆ తీర్పుల్లో సుప్రీంకోర్టు  కొట్టివేసింది. ఏదైనా క్రిమినల్ కేసులో 2 లేదా అంతకన్నా ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన ప్రజా ప్రతినిధికి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 సబ్ సెక్షన్ 4  ఒక వెసులుబాటు కల్పిస్తుంది. జైలు శిక్ష పడిన ఆ ప్రజా ప్రతినిధిని వెంటనే అనర్హుడిగా ప్రకటించకూడదని, అతడికి పై కోర్టుకు అప్పీల్ చేసుకోవడానికి 3 నెలల సమయం ఇవ్వాలని, పై కోర్టు స్టే విధిస్తే అనర్హత నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఆ సెక్షన్ నిర్ధారిస్తుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని ఆ సెక్షన్ 8(4)  ను తన తీర్పుల్లో సుప్రీంకోర్టు  కొట్టివేసింది.

ఆ ఆర్డినెన్స్ ల్లో ఏముంది?
        సుప్రీంకోర్టు  తీర్పు కు వ్యతిరేకంగా 2013లో అధికారంలో ఉన్న యూపీఏ  ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్  ను తీసుకువచ్చింది. జైలు శిక్ష పడిన ప్రజా ప్రతినిధిని వెంటనే, తక్షణమే అనర్హుడిగా ప్రకటించకూడదని, అప్పీల్ కు సమయం ఇవ్వాలని, పై కోర్టు స్టే విధిస్తే, అనర్హత అంశం పై నిర్ణయం తీసుకోకూడదని పేర్కొంటూ, అంటే, దాదాపు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని ఆ సెక్షన్ 8(4) ను Representation of the People Act - RP Act section 8(4) పునరుద్ధరిస్తూ ఆ ఆర్డినెన్స్  ను రూపొందించారు.

 ఆర్డినెన్స్ ను చించేసిన రాహుల్
         ఆ ఆర్డినెన్స్  ను రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా వ్యతిరేకించారు. అది అర్థం లేని ఆర్డినెన్స్  అని మండిపడ్డారు. ఒక ప్రెస్ మీట్ లో ఆ ఆర్డినెన్స్ పై తన వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ, ఆ ఆర్డినెన్స్  కాపీని చించేశారు. రాహుల్ ఆర్డినెన్సు కాపీని చించి వేయడంతో మన్మోహన్ ప్రభుత్యం ఆ ఆర్డినెన్సును వెంటనే ఉపసంహరించుకుంది. యువరాజుకు కోపం వస్తే ఆషామాసీ  కాదుకదా? ఆ ఆర్డినెన్స్ ను చించేసిన దాదాపు 10 సంవత్సరాల తరువాత.. రాహుల్ గాంధీ  తనే స్వయంగా అనర్హతకు గురి కావడం విశేషం. 2019లో కర్నాటకలో ఒక సభలో మాట్లాడుతూ, దేశాన్ని దోచుకుంటున్నవారికందరికీ మోదీ  అనే ఇంటి పేరు ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై పూర్ణేశ్ మోదీ గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే సూరత్ కోర్టులో కేసు వేశారు. ఆ కేసు విచారణ అనంతరం సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. సుప్రీంకోర్టు  తీర్పు ప్రకారం జైలు శిక్ష పడిన వెంటనే రాహుల్ గాంధీ అనర్హతకు గురయ్యారు. ఇది స్వయం కృతాపరధమే కదా? ఈ కేసులో మోదినో, మరొకరిలో భాధ్యులు చేయడం ఎంతవరకు సబబు?

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *