21, మార్చి 2023, మంగళవారం

MROను బదిలీ చేసిన కలెక్టర్ కి అభినందనలు: CPM

MROను బదిలీ చేసిన కలెక్టర్ కి అభినందనలు: CPM          

 

 చిత్తూరు తాహిసిల్దార్ పార్వతి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, కలెక్టర్  అనేక సార్లు హెచ్చరించినా    మార్పు రాకపోవడంతో బదిలీ చేశారని కలెక్టర్ తీసుకున్న చర్యలను   సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు స్వాగతిస్తూ కలెక్టర్ కి అభినందనలు తెలియజేశారు.            

      ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పేదల అనుభవంలో ఉన్న ప్రభుత్వ భూములను  అధికార పార్టీ వారికి కట్టబెడుతున్నట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి. సంవత్సరాల కొద్ది పేదల భూములు పైఅన్ని రకాల హక్కులు ఉన్నప్పటికీ ఆ భూములను కూడా అధికార పార్టీ నాయకులకు మామూలు తీసుకొని రికార్డు లో మార్పులు చేస్తున్నది. రెవెన్యూ అధికారులు పేదలకు న్యాయం చేయకుండా లంచాలకు అలవాటు పడి భూకబ్జాదారులకు అండగా నిలవడం చిత్తూరు మండలం సరామాములుగా ఉంటున్నది. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవడం సబబేనని అన్నారు. ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ వ్యవహరిస్తున్న తీరు బాధాకరమన్నారు. వచ్చే అధికారులైన చిత్తూరు ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా తమ విధులు నిర్వహించాలని ఆయన కోరారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *