ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే బ్లాక్ డే : TDP
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే బ్లాక్ డే
రాష్ట్ర TDP కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ఎం పర్వీన్ తాజ్
టిడిపి ఎమ్మెల్యేలపై వైసీపీ రౌడీల దాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే బ్లాక్ డే అని రాష్ట్ర తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ఎం పర్వీన్ తాజ్ అన్నారు. సోమవారం మదనపల్లెలో విలేకరులతో మాట్లాడుతూ విపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై అధికార వైసీపీ ఎమ్మెల్యేలు గూండాల మాదిరిగా దాడి చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే కళంకం అన్నారు. ప్రజాస్వామ్య దేవాలయం శాసనసభలోనే ఈ దాడి జరిగింది. వైసీపీ ఫ్యాక్షన్ మూకలు అసెంబ్లీలో పాల్పడిన దుశ్చర్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే బ్లాక్ డేగా మిగిలిపోతుంది. టిడిపికి చెందిన దళిత ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, టిడిపి సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరిని చంపడానికి వైసీపీ గూండా ఎమ్మెల్యేలు ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికే చీకటి రోజు. మూడు ప్రాంతాల్లోనా పట్టభద్రులు వైసీపీని ఛీకొడుతూ టిడిపి అభ్యర్థుల్ని గెలిపించడం ఓర్చుకోలేని వైసీపీ ఎమ్మెల్యేలు తమ ఫ్యాక్షన్ మెంటాలిటీని అసెంబ్లీలోనే చూపించారు. మంత్రి అంబటి రాంబాబు వీధి రౌడీ కంటే ఘోరమైన ప్రవర్తన రాజకీయాలకే కళంకం తెచ్చేదిగా ఉంది. టిడిపి సభ్యులు అసెంబ్లీలో శాంతియుతంగా తమ హక్కు అయిన నిరసన తెలుపుతుంటే, `` టిడిపి వాళ్లు ఒక్కరుంటే, మనం ముగ్గురం ఉన్నాం.. కొట్టండి`` అంటూ మంత్రి రాంబాబు కేకలు వేయడంతో ఒక్కసారిగా వైసీపీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా టిడిపి ఎమ్మెల్యేలపై దాడికి దిగారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి. భారత రాజ్యాంగంపై దాడి అని అభివర్ణించారు.
ఈ సమావేశంలో చావడి కిట్టన్న, రవికుమార్ ప్రభాకర, పట్టా చంద్రమోహన్ రెడ్డి, మదార్ సాబ్ తదితరులు పాల్గొన్నారు.