24, మార్చి 2023, శుక్రవారం

ఏప్రిల్ 5న చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ


 ఏప్రిల్ 5న చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ 

         కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై సిఐటియు- రైతు సంఘం- వ్యవసాయ కార్మిక సంఘం- కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో  ఏప్రిల్ 5న చేపట్టిన చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ శుక్రవారం చిత్తూరు సిఐటియు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె. సురేంద్రన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఓబుల్ రాజులు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా కార్మిక చట్టాలను మార్పు చేయడం, రైతులకు కనీసం మద్దతు ధర ప్రకటించకపోవడం, వ్యవసాయ కార్మికులకు ఉపాధి దెబ్బతీయడం లాంటి అనేక రకాల వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని వీటిని వ్యతిరేకిస్తూ గల్లి నుంచి ఢిల్లీ వరకు విస్రృతమైన ప్రచారం చేసి లక్షలాది మందితో ఏప్రిల్ 5న  ఢిల్లీలో కనివిని ఎరుగని రీతిలో భారీ స్థాయిలో ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి కూడా నాలుగు సంఘాల ఆధ్వర్యంలో పట్టణాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. అధిక సంఖ్యలో ఢిల్లీకి తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే విస్తృతంగా కరపత్రాలు ద్వారా ప్రచారం జరుగుతున్నదని ఇంకా అన్ని గ్రామాల్లోనూ విస్తృతంగా బిజెపి అవలంబిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై  ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. దేశంలోని ప్రజల సంపదను కార్పొరేట్ శక్తులైన ఆదానీ ,అంబానీలకు కట్టబెట్టే ప్రయత్నంలో మోడీ మునిగి తేలుతున్నారని దీనిని అడ్డుకట్ట వేయాలని తెలిపారు. ఢిల్లీ కార్యక్రమానికి జిల్లా నుంచి కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు కౌలు రైతులు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు పి. చైతన్య, ఉపాధ్యక్షులు వాడ గంగరాజు, గిరిధర్ గుప్తా ,జ్యోతిరావు తదితరులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *