10, మార్చి 2023, శుక్రవారం

నిరుద్యోగులను మోసం చేసిన ఇద్దరి అరెస్టు

             నిరుద్యోగులను మోసం చేసిన ఇద్దరి అరెస్టు 


           కన్సల్టెన్సీ పేరుతో సుమారు రూ.70 లక్షల వరకు నిరుద్యోగులకు  మోసం చేసిన ముద్దాయిలను శుక్రవారం   చిత్తూరు క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేచారు. గత కొంత కాలంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మ  బలికి అమాయకులైన బి.టెక్ పూర్తిచేసిన విద్యార్థులను టార్గెట్ చేశారు. వారి వద్ద నుండి  సుమారు 70 లక్షల వరకు డబ్బులు వాసులు చేసారు. నిరుద్యోగుల ఫిర్యాదు మేరకు  జి.అనిల్ కుమార్ రెడ్డి, 33 సం. ను చిత్తూర్ క్రైమ్ పోలీసులు  అరెస్ట్ చేసారు. ఈ మోసాలకు అనిల్ కుమార్ కు సహకరించిన అతని స్నేహితుడు శివ కుమార్, 26 సం. ను కూడా అరెస్ట్ చేయడం చేశారు.

         

     కొర్లగుంట, తిరుపతి నందు నివాసముంటున్న సాయి శ్రీనివాస్ కు బెంగుళూరు లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని అతని వద్ద నుండి డబ్బులు తీసుకొని అతనిని మోసం చేసాడని బాధితుడి చేశారు. ఫిర్యాదు మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ  వై.రిశాంత్ రెడ్డి గారి ఆదేశాలతో చిత్తూరు క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించారు. శుక్రవారం ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది.వీరు దాదాపు 25 మందిని మోసం చేసినట్టు తెలుస్తోంది. మన రాష్ట్రం లోనే కాకుండా పక్క రాష్ట్రం లో కూడా ఇతని బాధితులు ఉండటంతో దాని పై కూడా విచారణ చేస్తామని ఇటువంటి కన్సల్టెన్సీ లపై దృష్టి సారిస్తామని తెలియజేసారు. ఇలాంటి దళారులను నమ్మి మోసపోవద్దని ఇప్పటికే ఏదైనా కన్సల్టెన్సీ చేతిలో మోసపోయిన వారు వెంటనే వారి సంబందింత పోలీస్ స్టేషన్ లో తెలుపవలెనని చిత్తూరు పోలీసు కోరారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *