టిచర్లను బయపెడితే విద్యార్థులకు విద్య వస్తుందా ? UTF సూటి ప్రశ్న
టిచర్లను బయపెడితే విద్యార్థులకు విద్య వస్తుందా ?
UTF జిల్లా కౌన్సిల్ సూటి ప్రశ్న
స్వేచ్ఛయుత వాతావరణంలో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులని భయభ్రాంతులకు గురి చేయటం వలన విద్యార్థులకు ఎలా నాణ్యమైన విద్య ఎలా వస్తుందో ప్రభుత్వం చెప్పాలని రాష్ట్ర గౌరవాధ్యక్షులు కొమ్మోజీ శ్రీనివాసరావు ప్రశ్నించారు. చిత్తూరూ జిల్లా యుటిఎఫ్ 47 వ జిల్లా కౌన్సిల్ సమావేశాలు చిత్తూరులోని శాంతా రఘురామన్ కల్యాణ మండపంలో పి. సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగాయి.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయిన రాష్ట్ర గౌరవాధ్యక్షులు కొమ్మోజీ శ్రీనివాసరావు విద్యారంగ సంస్కరణల పేరుతో ప్రాథమిక పాఠశాలలను విలీనం చేయటం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య రాకపోగా చాలామంది విద్యార్థులు పాఠశాలలను వదిలి వెళ్ళిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . 12వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు రాష్ట్రంలో ఉన్నాయని దీనిలో విద్యార్థులకు ఎలా నాణ్యమైన విద్య వస్తుంది. ఈ పాఠశాలలు మూసివేతకు గురవుతాయని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ అధికారులు పాఠశాలలను విజిట్ చేయటాన్ని యుటిఎఫ్ స్వాగతిస్తుందని, అదే సందర్భంలో ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
బోధనేతర కార్యక్రమాలకు ఇచ్చే ప్రాముఖ్యత విద్యార్థులకు బోధన చేయడానికి అవకాశం లేకుండా చేస్తున్నారని విమర్శించారు.. బూట్లు లేకపోవడం, పుస్తకాలు లేవని, వర్కుబుక్ లు దిద్దలేదని ఉపాద్యాయులను ప్రశ్నిస్తున్న అధికారులు, విద్యార్థులకు ఇవ్వన్నీ ఎప్పుడు ఇచ్చారో పర్యవేక్షణ చేయకపోడం సరికాదని తెలిపారు. ఉపాధ్యాయుల సంఖ్యను కుదించటం, ఉపాధ్యాయులను భయపెట్టడం ద్వారా విద్యార్థులకు విద్య రాదు అనే అంశాన్ని విద్యాశాఖ అధికారులు గుర్తించాలని కోరారు.. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉపాధ్యాయులు ఉద్యమం చేస్తుంటే వారిని నిర్బంధించడం, కేసులు పెట్టడం ఎలాంటి ప్రజాస్వామ్యమో చెప్పాలని కోరారు. ప్రాథమిక పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల సంఖ్యను కుధిస్తూ ఇచ్చిన జీవో 117 ని ఉపసంహరించకుండా, ప్రభుత్వ రంగంలో పాఠశాల వ్యవస్థని కాపాడుకోవడం సాధ్యం కాదని తెలియజేశారు.. ప్రాథమిక పాఠశాల వ్యవస్థని పరిరక్షించుకునే దానికోసం తల్లిదండ్రులతో కలిసి సామాజిక ఉద్యమాన్ని నిర్మించాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. హక్కుల కోసం పోరాడుతూనే, బాధ్యతలు విషయాలలో ఉత్తమ ఉపాధ్యాయులుగా నాణ్యమైన విద్య విద్యార్థులకు అందించే దిశగా మన పని ఉండాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. .ఉపాధ్యాయులు ఎవరు మనోధైర్యాన్ని కోల్పోవద్దని, టెన్షన్లకు గురి కాకుండా ఉండాలని బాధ్యతను మరింత శ్రద్ధతో పనిచేసే వైపు మనో నిబ్బరంతో ఉండాలని కోరారు. యూటీఎఫ్ ఉపాధ్యాయుల పక్షాన, ఉద్యమాల పక్షాన ఉంటుందని, నిరంతరం ఉద్యమాల ద్వారానే మన సమస్యలు పరిష్కారం అవుతాయని ఉద్యమాల్లో మీరందరూ కలిసి రావాలని కోరారు.మున్సిపల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు డిడిఓ పవర్ సాధించడంలో యూటీఎఫ్ చిత్తశుద్ధితో వ్యవహరించిందని తెలిపారు.. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాల్సిందేనని CPS కి ప్రత్యామ్నాయంగా జిపిఎస్ ను తీసుకొచ్చే విధానాన్ని అంగీకరించమని తెలిపారు.. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సినటువంటి 3 వేల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
అంతకుముందు STFI పతాకాన్ని UTF సీనియర్ నాయకులు రాధాకృష్ణ, యుటిఎఫ్ జెండాని గౌరవాధ్యక్షులు సోమశేఖర్ నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకత్వం మాట్లాడుతూ ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాధ్యాయ హక్కులపై దాడి చేస్తున్నాయని, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయని, వీటిని ఎదుర్కొనే దానికోసం ఉపాధ్యాయులు అందరూ పోరాటానికి సిద్ధం కావాలని కోరారు.. CITU జిల్లా నాయకులు Y. మాట్లాడుతూ పోరాటాలు చేయుటలో యూటీఎఫ్ అగ్రభాగాన ఉందని అభినందించారు. మీలాగా పోరాటాలు చేసే సంస్థలకు సంఘీభావాన్ని తెలియజేయడంతో పాటు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి ఐక్య ఉద్యమాన్ని నిర్మించాలని కోరారు.
యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి G. V. రమణ మాట్లాడుతూ ఈ జిల్లాలో ఉపాధ్యాయుల మనో ధైర్యాన్ని నిలబెట్టే దానికోసం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేశామని, భవిష్యత్తు లో ఉపాధ్యాయుల సంక్షేమం కోసం, విద్యారంగ సంకేమం కోసం కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ MLC అభ్యర్థి P. బాబురెడ్డి, గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థి మీగడ వెంకటేశ్వర రెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్సులు టి. రఘుపతి రెడ్డి, S. S. నాయుడు, UTF తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల రెడ్డి, చిత్తూరు జిల్లా UTF సహాధ్యక్షులు మునిరత్నం, రెహాన బేగం, కోశాధికారి ప్రసన్నకుమార్, CITU నాయకులు చైతన్య, గంగరాజు, JVV నాయకులు శివప్రసాద్, UTF జిల్లా కార్యదర్శులు కె. శేఖర్, జగన్మోహన్ రెడ్డి, కృష్ణమూర్తి, రెడ్డెప్ప నాయుడు, గాలి సురేష్, దక్షిణామూర్తి, లక్ష్మీపతి, రూప, సరిత ఆడిట్ కమిటీ కన్వీనర్ మణిగండన్, CPS కన్వీనర్ బాషా, సోషల్ మీడియా కన్వీనర్ శశికుమార్ మరియు అన్నీమండలాల నుండి అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.