30, మార్చి 2023, గురువారం

చిత్తూరులో అత్యంత వైభవంగా శ్రీరామనవమి

 చిత్తూరులో అత్యంత వైభవంగా  శ్రీరామనవమి 


         చిత్తూరు నగరంలోని రాములు గుడి వీధిలో  ప్రముఖ దేవాలయమైన కోదండ రామస్వామి ఆలయంలో ఈనెల 29వ తేదీ నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు  చెర్మన్ వెంకటేష్ గుప్తా, ఆలయ ధర్మకర్త రాజా, ప్రధాన అర్చకులు వేణుగోపాలస్వామి  తెలిపారు. ఈ నెల 30వ తేదీ గురువారం ఉదయం శ్రీరామనవమి వేడుకలను కన్నుల పండుగ నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా సాయంత్రం ద్వాజారోహణ కార్యక్రమం నిర్వహిస్తామని ఏప్రిల్ 1వ తేదీన గరుడ వాహనం,  ఆరవ తేదీన గుర్రపు వాహనం,  8వ తేదీన శ్రీ సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఐదవ తేదీ నూతన రథం పైన శ్రీరాముడు భక్తులకు దర్శనమిస్తారన్నారు. ఆలయ ధర్మకర్త ధర్మకర్తల మందలి సభ్యుల సహకారంతో భద్రాద్రిని తలపించే విధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. భక్తులు విశేషంగా బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపాకటాక్షానికి పాత్రులు కావాలని కోరారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం  కలగకుండా క్యూలైన్ల ద్వారా దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందించారు. శ్రీరామనవమి సందర్భంగా చిత్తూరు నగరంలోని పలు దేవస్థానంలో సతీ సమేతంగా  చిత్తూరు శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు పూజలు నిర్వహించారు. 


వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యం మజ్జిగ, పంపిణి


         చిత్తూరు పట్టణంలోని కోదండ రామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా వాసవి క్లబ్ వనిత చిత్తూరు వారి ఆధ్వర్యంలో రామాలయానికి విచ్చేసిన భక్తులకు మజ్జిగ ను పంపిణీ చేశారు.  వాసవి క్లబ్ వనిత సభ్యులు సేవా కార్యక్రమాలలో ఎప్పుడు ముందుంటూ ఏదో ఒక కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ  అందులో  భాగంగా శ్రీరామ నవమి సందర్భంగా  17 సంవత్సరం గామజ్జిగ పంపిణీ చేయడం విశేషం.  ఈ కార్యక్రమాన్ని వాసవి క్లబ్ వనిత ప్రెసిడెంట్ రాధిక సెక్రటరీ లీలా కుమారి ట్రెజరర్ కుసుమ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ వాణి రమేష్ వైస్ ప్రెసిడెంట్ లలితా దేవి జాయింట్ సెక్రటరీ శైలజ,కుమారితదితరులు పాల్గొన్నారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *