స్పందనకు 324 అర్జీలు
స్పందనకు 324 అర్జీలు
స్పందనలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం ఉదయం ప్రతి సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే స్పందన కార్యక్రమంలో డి.ఆర్.ఓ ఎన్.రాజశేఖర్, జడ్పీ సీఈవో ప్రభాకర్ రెడ్డిలతో కలసి జిల్లా నలుమూలల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు.
మొత్తం 324అర్జీలు రాగా, ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 189,పోలీసు శాఖకు 4,హౌసింగ్ శాఖ 13,విద్యా శాఖ 3, మైన్స్ శాఖ 1, జిల్లా కొ-ఆర్డినేటర్ గురుకుల 1 ,ఎక్సైజ్ శాఖ 1, డ్వామా 2, జిల్లా పరిషత్ 2,లేబర్ డిపార్ట్మెంట్ -1, రిజిస్టేషన్ అండ్ స్టాంప్ 1, సివిల్ సప్లె 1 ,ఇరిగేషన్ 3 ,జిల్లా పంచాయతీ శాఖ 2,జిల్లా సైనిక్ వెల్ఫేర్ 1,మున్సిపల్ 3 ,ఎల్ డి ఎం 1 ,ఇతరులు 10,పింఛన్లు,రేషన్ కార్డ్స్ 85, అర్జీలు రావడం జరిగిందని తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు, జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు డి.ఆర్.ఓకు అందజేశారు.రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని, జిల్లా అధికారులు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు గైకొని పరిష్కరించాల్సిందిగా డి.ఆర్.ఓను మరియు జిల్లా అధికారులను ఆదేశించారు.