16, మార్చి 2023, గురువారం

విద్యుత్తు షాక్ కు ఒకరి మృతి

    విద్యుత్తు షాక్ కు ఒకరి మృతి, మరొకరికి విషమయం 


    చిత్తూరు జిల్లా వి.కోట. నడమంత్రంలో ఇద్దరు విద్యుత్ షాక్ కు గురయ్యారు. ఒక్కరు మృతి చెందగా, ఒక్కరి పరిస్థితి విషమంగా ఉంది. చెరువు దగ్గరికి వెళ్లి విద్యుత్ ఘాతానికి గురైన వ్యక్తిని కాపాడే క్రమంలో యువకుడు మృత్యువాత పడ్డాడు. రెస్కో అధికారుల నిర్లక్ష్యం విద్యుత్ షాక్తో యువకుడి బలి తెసుకుందని, మారో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయని స్తానికులు ఆరోపిస్తున్నారు.  వీరి  కుటుంబ సభులు వీధిన పడ్డారని ఆవేదన చెందారు. 

     ఆగ్రహించిన బాధితులు శవంతో వి.కోట మండల కేంద్రం అంబేద్కర్ సర్కిల్ వద్ద అంబేడ్కర్ విగ్రహం ముందు ధర్నా చేశారు. జాతీయ రహదారిపై బైఠాయింపుతో  గంటల తరబడి ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.  రెస్కో ఏ ఈ,డి ఈ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రెస్కో కార్యాలయం ముట్టడి చేశారు.  ఏళ్ల తరబడి మొరపెట్టుకున్న పట్టించుకోలేదని బాధితులు కన్నీటి పర్యంతం అయ్యారు. లైన్ మాన్  జయ్యప్ప నిర్లక్ష్యంతోనే యువకుడి మృతని బాధితుల ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *