MLC ఎన్నికల కౌంటింగ్ నేడే
MLC ఎన్నికల కౌంటింగ్ నేడే
ఉ.8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం
కౌంటింగ్ ప్రక్రియ కొరకు 916 మంది సిబ్బంది నియామకం
రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్
ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజక వర్గ ఎం.ఎల్.సి.ఎన్నికల కౌంటింగ్ గురువారం నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ మరియు రిటర్నింగ్ అధికారి యం. హరినారాయణన్ బుధవారం తెలిపారు.
భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 న ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎం.ఎల్.సి. ఎన్నికల పోలింగ్ నిర్వహించడం జరిగిందని, పట్టభద్రుల ఎం.ఎల్.సి ఎన్నికలకు సంబంధించి తిరుపతిలోని 229 మరియు 233 పోలింగ్ స్టేషన్ల లో ఈ నెల 15 న రీ పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 16 న గురువారం చిత్తూరు ఆర్.వి.ఎస్. లా కాలేజ్ నందు ఉపాధ్యాయ ఎం.ఎల్.సి., ఇంజనీరింగ్ కళాశాల నందు పట్టభద్రుల ఎం.ఎల్.సి. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉ.8 గంటలకునిర్వహించడం జరుగుతుందని, అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు కౌంటింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణను ఇవ్వడం జరిగిందని తెలిపారు.
పట్టభద్రుల ఎం.ఎల్.సి. కౌంటింగ్ కొరకు 40 టేబుల్స్, ఉపాధ్యాయ ఎం.ఎల్.సి కౌంటింగ్ కు 14 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ప్రక్రియలో 193 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 551 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 172 మంది మైక్రో అబ్జర్వర్లు మొత్తం 916 మంది సిబ్బంది పాల్గొననున్నారని కలెక్టర్ తెలిపారు.