20, మార్చి 2023, సోమవారం

ANMలను రెగ్యులరైజ్ చేయాలి

ANMలను రెగ్యులరైజ్ చేయాలి


          ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సెకండ్ బ్యాచ్ లో గ్రామ వార్డు సచివాలయ ఏఎన్ఎమ్స్ హెల్త్ సెక్రెటరీలుగా నియామకం అయి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏఎన్ఎమ్స్ హెల్త్ సెక్రెటరీలకు తక్షణమే ప్రొబిషన్ పూర్తి చేసి రెగ్యులరైజ్ చేయాలని ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఏఎన్ఎమ్స్ హెల్త్ సెక్రెటరీస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు. ఆ మేరకు ఏఎన్ఎమ్స్ తో కలిసి జిల్లా DM&HO కార్యాలయంలో ఏఓకు కలెక్టర్ కార్యాలయంలో స్పందనలో వినతి పత్రం అందజేశారు.

      ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సెకండ్ బ్యాచ్ లో దాదాపు 60 మందికి పైబడి ఏఎన్ఎమ్స్ గా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రొబిషన్ పూర్తి చేయాలని అనేక సార్లు అధికారులకు తెలియజేసిన ఇంతవరకు ప్రొబిషన్ డిక్లేర్ చేసి రెగ్యులరైజ్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి తక్షణమే ప్రొబిషన్ డిక్లేర్ చేసి ఏఎన్ఎమ్స్ ను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ చిత్తూరు పట్టణ కార్యదర్శి సత్యమూర్తి, బాలాజీ ఏఎన్ఎమ్స్ పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *