12, మార్చి 2023, ఆదివారం

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సహకరించండి..

 ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సహకరించండి..

జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి హరి నారాయణన్ 


             ప్రశాంత వాతావరణంలో శాసనమండలి ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలని రిటర్నింగ్ అధికారి& జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ కోరారు. ఆదివారం చిత్తూరు డివిజన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కమ్ రిసెప్షన్ సెంటర్ ను రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తో కలసి పరిశీలించారు.  

        ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి అధికారులకు, పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు జారీ చేసారు.  అనంతరం రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ జిల్లా లోని 4 రెవిన్యూ డివిజన్ పరిధిలో (చిత్తూరు, నగరి, పలమనేరు, కుప్పం) పరిధిలో ప్రశాంత వాతావరణం లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటరు స్లిప్ తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల ఫోటో గుర్తింపు కార్డులలో ఏదోఒకటి తీసుకు రావాలని, పోలింగ్ ఉదయం 8 గం. ల నుండి సాయంత్రం 4 గం. ల వరకు జరుగుతుందని, స్వచ్చందంగా ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన పెన్నుతో మాత్రమే బ్యాలెట్ పేపర్ తో మార్క్ చేయాల్సి ఉంటుందన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి పోలింగ్ కేంద్రం లో వెబ్ కాస్టింగ్ నిర్వహించడంతో పాటు సూక్ష్మ పరిశీలకులను నియమించడం జరిగిందని, తద్వారా ఎన్నికలు పారదర్శకంగా సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 


   

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *