17, మార్చి 2023, శుక్రవారం

బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డును అందుకున్న చంద్రశేఖర్ రెడ్డి

  రాష్ట్ర గవర్నర్  నుంచి బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డును అందుకున్న చంద్రశేఖర్ రెడ్డి

Teachers MLC పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బయోడేటా 


పేరు         : పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

తండ్రి పేరు : పర్వత రెడ్డి సుందర రామిరెడ్డి

తల్లి పేరు : పర్వత రెడ్డి సుజాతమ్మ

స్వగ్రామం : వల్లిపేడు గ్రామం, చిల్లకూరు మండలం, తిరుపతి జిల్లా. 

ప్రస్తుతం :  రాంజీ నగర్ మూడవ వీధి, చిల్డ్రన్స్ పార్క్ దగ్గర,  నెల్లూరు.

పుట్టిన తేది : 26-06-1972

విద్యార్హతలు : M.Sc (maths) 

విద్యార్ధి దశ : 1987లో నెల్లూరు డి సి ఆర్ జడ్పీ హైస్కూల్లో పదో తరగతి, 1989-92లో సర్వోదయ కళాశాలలో ఇంటర్, డిగ్రీ, 1994లో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ లో ఎమ్మెస్సీ, అనంతరం ఎంబీఏ ను పూర్తి చేశారు.

ప్రస్తుతం : చైర్మన్, శ్రీ కృష్ణ చైతన్య విద్యాసంస్థలు

 సేవా కార్యక్రమాలు.

గత 24 సంవత్సరాలుగా నెల్లూరు నగరంలో కృష్ణ చైతన్య విద్యా సంస్థల ద్వారా తక్కువ ఫీజు తో పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గా చంద్రశేఖర్ రెడ్డి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరోనా సమయంలో రెడ్ క్రాస్ సేవలకు రాష్ట్ర, దేశస్థాయిలో గుర్తింపు లభించింది. కోవిడ్ వ్యాధిగ్రస్తులకు ప్లాస్మా అందించడం, ఆక్సిజన్ రధ చక్రాల ద్వారా ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయడం, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందజేయడం, కోవిడ్ ద్వారా మరణించిన మృతదేహాలకు గ్యాస్ ఆధారిత మొబైల్ క్రిమిటోరియం మిషన్ ద్వారా దహన సంస్కారాలు చేయడం, కోవిడ్ బాధితులకు మందులు, వసతి, భోజన సౌకర్యాలు కల్పించడం... ఇలా అనేక రకాల సేవా కార్యక్రమాలను చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టి నెల్లూరు రెడ్ క్రాస్ కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. ఈ సేవలకు గుర్తింపుగా 2022, ఏప్రిల్ లో అప్పటి రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరి చందన్ గారి నుంచి బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డును అందుకున్నారు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *