అంగన్వాడీల అరెస్టు చేయడం దారుణం: C P M
అంగన్వాడీల అరెస్టు చేయడం దారుణం
కుప్పంలో అంగన్వాడీలను వెంటనే విడుదల చేయాలి
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆందోళన పిలుపునిస్తే చిత్తూరు జిల్లాలో కుప్పం, రామకుప్పం లో పోలీసులు అత్యుత్సాహం చూపి అంగన్వాడీలను అరెస్టు చేయడం దారుణమని వారిని వెంటనే విడుదల చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు గంగరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే ఎక్కువ వేతనాలు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీలను మర్చిపోవడం దారుణం అన్నారు. హామీలను అమలు చేయాలని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి గుర్తు చేయడానికి అంగన్వాడీలు బయలుదేరితే వారిని ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైన రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి రాలేదని విమర్శించారు. మహిళలను చూడకుండా పోలీస్ స్టేషన్ల కి తరలించడం ,భోజనాలు కూడా పెట్టకపోవడం దుర్మార్గమన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయని ఏ ప్రభుత్వం కూడా మనుగడ లేదని ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. జిల్లాలో అనేకచోట్ల అంగన్వాడీల పై పోలీసులు ఉక్కు పాదం మోపడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.