లోకేశ్ యువగళం పాదయాత్రకు రెండు రోజుల బ్రేక్
40 రోజుల పాదయాత్రలో 76 మందిపై 22 కేసులు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పాదయాత్రకు MLC ఎన్నికల నిబందనలు అడ్డురావడంతో రెండు రోజులు విరామం ప్రకటించారు. రెండు రోజుల విరామ సమయంలో నారా లోకేష్ హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. జనవరి 27వ తేదీన కుప్పం నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. యువగళం పాదయాత్రకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. యువగళం పాదయాత్ర ప్రారంభించక ముందు నుంచి అనేక అడ్డంకులు ఎదురైనా విజయవంతంగా ప్రారంభించిన నారా లోకేశ్ పాదయాత్రను కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్-1 నిబంధనల ప్రకారం లోకేశ్ తన పాదయాత్ర కొనసాగించాలని పోలీసుల నుంచి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనలకు లోబడి పోలీసుల ఆంక్షల మేరకు నారా లోకేశ్ పాదయాత్ర నిర్వహిస్తూ ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటూ నలభై రోజుల పాటు దిగ్విజయంగా పాదయాత్రను కొనసాగించారు. అయితే రేపు, ఎల్లుండి లోకేశ్ పాదయాత్రకు విరామం ప్రకటించనున్నారు.
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నలభై రోజులు పూర్తి చేసుకుని నలభై ఒకటో రోజున తంబళ్లపల్లె నియోజకవర్గంలో కొనసాగుతుంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉన్నందున రేపు, ఎల్లుండి పాదయాత్రకు నారా లోకేశ్ విరామం ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 27వ తేదీన మొదలైన ఈ పాదయాత్ర నిన్నటితో నలభై రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో జోవో నెంబర్ -1 కు వ్యతిరేకంగా ప్రవర్తించారంటూ నారా లోకేశ్ పై 22 కేసులు నమోదు చేయడంతో పాటు మొత్తం 76 మంది టీడీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 13 నియోజకవర్గాలు పూర్తి చేసుకుని, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో నలభై ఒకటో రోజు యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ పాల్గొంటున్నారు. నలభై రోజుల పాటు జరిగిన యువగళం పాదయాత్రలో మొత్తం 520 కిలోమీటర్ల మేర లోకేశ్ యువగళం పాదయాత్ర సాగింది. లోకేశ్, అచ్చెన్నాయుడుతో సహా 76 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా పాదయాత్రకు నారా లోకేశ్ రేపు, ఎల్లుండి విరామం ప్రకటించారు. తిరిగి ఈ నెల 14వ తేదీన లోకేశ్ యువగళం పాదయాత్రను తిరిగి తంబళ్లపల్లె నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు.