19, మార్చి 2023, ఆదివారం

KGFలో బోర్డర్ క్రైమ్ మీటింగ్


    KGFలో బోర్డర్  క్రైమ్ మీటింగ్

     చిత్తూరు జిల్లా ఎస్పి  వై. రిషాంత్ రెడ్డి ఆదేశానుసారం ఆదివారం పలమనేరు SDPO సుధాకర్ రెడ్డి  కే.జి.ఎఫ్ జిల్లా ఎస్పి  ధరణి దేవి, ఇతర అధికారులతో కే.జి ఎఫ్ నందు గల BEMR గెస్ట్ హౌస్ నందు బోర్డర్ క్రైమ్ మీటింగ్ ను నిర్వహించడం జరిగింది. 

      కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల బోర్డర్ లలో జరిగే అక్రమ రావాణాను అరికట్టేందుకు ఈ మూడు రాష్ట్రాలలోని పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్  మరియు తమిళనాడు బోర్డర్ లలో జరుగుతున్న అన్ని అక్రమ రవాణాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను గురించి సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రం వైపు అక్రమంగా జరిగే రేషన్ బియ్యం, గంజాయి రవాణా మరియు కర్ణాటక రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కు అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు తగు చర్యలను తీసుకోవాలని, అలానే అంతర్రాష్ట్ర నేరగాళ్ళ నేరాలను అరికట్టేందుకు, NBWs పెండింగ్ కేసులు, గుర్తు తెలియని మ్రుతుదేహాలు, మిస్సింగ్ కేసులు మరియు ఇతర బోర్డర్ క్రైమ్ ల గురించి తీసుకోవాల్సిన చర్యలు గురించి సమావేశంలో చర్చించారు.  ఈ సమావేశంలో కే.జి.ఎఫ్ డిఎస్పి శ్రీ రమేష్, కృష్ణగిరి మరియు కోలార్ జిల్లా డిఎస్పి లు, కుప్పం రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీ రియాజ్ అహ్మద్, రాళ్ల బదుగురు ఎస్సై శ్రీ మునస్వామి మరియు అధికారులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *