17, మార్చి 2023, శుక్రవారం

TDP అభ్యర్థి శ్రీకాంత్ కు 34,110 ఓట్ల మెజారిటీ



 పట్టభద్రుల నియోజకవర్గ MLC ఎన్నికల్లో గెలుపొందిన కంచర్ల శ్రీకాంత్ 

 డిక్లరేషన్అందించిన రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ హరి నారాయణన్


        ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు  నియోజకవర్గ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో ప్రాధాన్యతా ప్రకారం ఓట్ల లెక్కింపులో  కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో  డిక్లరేషన్ అందించడం జరిగిందని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్, చిత్తూరు యం. హరి నారాయణన్ తెలిపారు.  శనివారం ఉదయం స్థానిక ఆర్ వి యస్ ఇంజనీరింగ్ కళాశాల నందు 16 నుంచి నిర్వహించిన కౌంటింగ్ ప్రక్రియ జరిగిన హాల్ నందు రిటర్నింగ్ అధికారి పట్టభద్రుల  ఎన్నికల్లో గెలుపొందిన కంచర్ల శ్రీకాంత్ కు డిక్లరేషన్ ను అందించారు. 

       ఈ నెల 16 న ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉదయం 8 గం.ల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై 18 న ఉదయం 2 గం.ల వరకు కొన సాగిన ఎలిమినేషన్ ఓటింగ్ ప్రక్రియతో తన సమీప అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ రెడ్డి పేర్నాటి  పై 34,110 ఓట్ల ఆధిక్యంతో కంచర్ల శ్రీకాంత్ గెలుపొందడంతో ఎన్నికల కమిషన్ జారీ చేసిన డిక్లరేషన్ ను అందుకున్నారు. 

   ఎలిమినేషన్ కౌంటింగ్ ప్రాధాన్యతా ప్రక్రియ విధానంతో మొత్తం 2,48,360 ఓట్లకు గానూ కంచర్ల శ్రీకాంత్  కు 1,24,181  ఓట్లు, శ్యామ్ ప్రసాద్ పెర్నాటి కి 90,071 ఓట్లు రావడం జరిగింద ని తెలిపారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, డి ఆర్ ఓ ఎన్. రాజశేఖర్ డిక్లరేషన్ అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *