20, మార్చి 2023, సోమవారం

సివిల్ సప్లై కార్పొరేషన్ ఉద్యోగులుగా గుర్తించాలి.

 హమాలీలను  సివిల్ సప్లై కార్పొరేషన్ ఉద్యోగులుగా గుర్తించాలి 

 హమాలీ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి మురళి డిమాండ్ 


         హమాలీలను  సివిల్ సప్లై కార్పొరేషన్ ఉద్యోగులుగా గుర్తించాలనీ, గుర్తించకపోతే ప్రభుత్వానికి మూల్యం తప్పదు హమాలీ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి మురళి హెచ్చరించారు. చిత్తూరు నగర కేంద్రమైన సివిల్ సప్లై హమాలి  కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ వద్ద సోమవారం ఉదయం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి ఆ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ  ఆహార భద్రత బిల్లు ఆమోదించి అమలు చేయాలని డిమాండ్ చేశారు.

       స్టేజి 1 ద్వారా డైరెక్ట్ మూమెంట్ చేయరాదు  అని సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మండలం స్టాక్ పాయింట్ నందు లోడింగ్ అన్ లోడింగ్ పనులు నిర్వహిస్తున్న హమాలీ కార్మికులకు పని భద్రత కల్పించాలన్నారు. వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వారి సమస్యల తక్షణం పరిష్కరించాలని అలాగే పెంచినటువంటి అరియర్స్ ని తక్షణమే ఇవ్వాలని కోరారు. యూనిఫామ్ సమస్య 2022 దసరాకు ఇవ్వవలసినటువంటి యూనిఫామ్ ఇంతవరకు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం అని ఆరోపించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ ఆహార భద్రత బిల్లును ఆమోదించి అమలు చేయకుండా ఉన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్ సి ఐ డి ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టిందన్నారు. ముఖ్యంగా రిలయన్స్ అంబానీ లకు డీమార్ట్ లో రిలయన్స్ మార్టు, మెట్రోలు మొదలగు వాటికి కారు చౌకగా గోడలను అద్దెకిచ్చి ప్రైవేటుపరం కావడానికి చూస్తుందని ఇందువల్ల రాష్ట్రంలో సి డబ్ల్యూ సి గోడౌన్లు కూడా రిలయన్స్ వారికి అప్పగించారని చెప్పారు. దీని ప్రభావం సివిల్ సప్లై కార్పొరేషన్ వారు కూడా బఫర్ గోడౌన్సయజమానులతో మరియు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని బఫర్  నుండి లేదా రైస్ మిల్స్ నుండి డైరెక్ట్ మూమెంట్ చేసి మండల స్టాక్ పాయింట్ లో పనిచేస్తున్న  కార్మికులకు ఉపాధి లేకుండా చేయాలని కుట్ర పండుతున్నదని చెప్పారు. దీనిని తిప్పి కొట్టాల్సిన బాధ్యత హమాలీ కార్మికుల పైన ఉన్నది అని తెలిపారు. ముఖ్యంగా గత 40 సంవత్సరాలుగా ఇదే పని నమ్ముకుని జీవిస్తున్న వారికి జీవనోపాధిపై దెబ్బ కొట్టడానికి జగన్ సర్కార్ ప్రయత్నిస్తుందనిఅన్నారు. హమాలీ కార్మికులు చెమటోడ్చి కష్టపడి కూడబెట్టిన సొమ్ము పీఎఫ్ డబ్బులు కూడా హమాలీ కార్మికులకు సక్రమంగా ఇవ్వడం లేదని ఆరోపించారు. దీనిని కూడా వాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్నారని ఇది చాలా దుర్మార్గమని వివరించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమం సాగిస్తామని అందుకు కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పెరిగిన హమాలీ కూలి రేట్లు పరిహరస్తో సహా తక్షణం చెల్లించాలని  డిమాండ్ చేశారు. 


       ఏఐటీయూసీ చిత్తూరు జిల్లా కార్యదర్శి కోదండన్ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు మాట్లాడుతూ  హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా హమాలీలను దగా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర్ కార్యదర్శి గోపీనాథ్, హమాలి యూనియన్ జిల్లా అధ్యక్షుడు అయ్యప్ప, నాయకులు చెంచయ్య, శేషయ్య, సురేష్, పాండు, అలి,ముందు రవి, అయ్యో సుబ్రహ్మణ్యం, మురళి, దస్తగిరి బాషా, కార్తీక్, వెంకటేష్, గణపతి తదితరులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *