12, మార్చి 2023, ఆదివారం

పురాతన శివాలయం కూల్చివేత

 

 కొలనుకొండ పురాతన శివాలయం కూల్చివేత 

 ఆత్మహత్య చేసుకుంటానని  శ్రీశైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆగ్రహం 


      
గుంటూరు కెనాల్ కట్టమీద,  కొలనుకొండ హైవే పక్కన  200 సంవత్సరాల నాటి పురాతన శివలింగం నందేశ్వరుడు విగ్రహాలకు నీడగా ఉన్న పాకాని స్థానిక ఎమ్మార్వో ఆదేశాలతో అర ఐ  తొలగించాడు. అధికారులు దుశ్చర్యతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు అడ్డుకున్న పురాతన శివలింగం నందేశ్రుడి విగ్రహాల దగ్గర తొలగించిన కట్టడాన్ని పునర్మిస్తామని  శివ స్వామి, స్థానిక ప్రజలు తేల్చి చెప్పారు. 

      తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామంలోని పురాతన శివాలయంను అధికారులు కూల్చివేయటాన్ని శ్రీశైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ హిందూధర్మం పై జరిగిన దాడిగా అభివర్ణించారు. అక్రమంగా నిర్మితమైన చర్చిలు మాత్రం అధికార్లకు కానరావటంలేదని, శతాబ్దాల చరిత్ర కలిగిన శివాలయాలను కూల్చి వేయటం ఏంటంటూ ప్రశ్నించారు. కొలనుకొండ శివాలయం పై తదుపరి చర్యలకు అధికారులు ఉపక్రమిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ శివస్వామి ఘాటుగా హెచ్చరించారు. సనాతన హిందూధర్మం పరిడ విల్లాలని, మన సంస్కృతి, సాంప్రదాయ పరిరక్షణ కై శతాబ్దాలనాటి మంగళగిరి నృసింహ స్వామివారి పెద్దకోనేరు పూడిక తీతపనులను స్థానిక యంఎల్ఎ ఆర్.కె ఒక కర్మయోగిలా, ఒకయఙ్ఞంలా చేపట్టి చారిత్రక, ఆధ్యాత్మిక సంపదను వెలికితీసి పదిలపరుస్తున్న తరుణంలో కొంతమంది క్రింది స్థాయి అధికారుల దుందుడుకు చర్యలవల్ల ప్రభుత్వానికి, స్థానిక ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *