లిటిల్ రోజ్ లో ఘనంగా ఉగాది సంబరాలు
లిటిల్ రోజ్ లో ఘనంగా ఉగాది సంబరాలు
చిత్తూరు గాంధీ రోడ్ లోని లిటిల్ రోజ్ ఉన్నత పాటశాల లో మంగళ వారం ఉదయం ఘనంగా ముందస్తు ఉగాది సంబరాలను నిర్వహించడం జరిగిందని పాటశాల కరస్పాండెంట్ డాక్టర్ బి గోపాల కృష్ణమూర్తి పేర్కొన్నారు. పాటశాల ను సుందరంగా అలంకరించి మామిడి వేపపూత బెల్లంతో ఉగాది పట్చది తయారుచేసి పూజను నిర్వహించి ఉగాది పండుగ యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించడం జరిగిందన్నారు. పాటలు, నృత్యాలతో విద్యార్థినీ విద్యార్థులు కేరింతలు కొట్టడం జరిగిందన్నారు. ఉగాది పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించామన్నారు. ఈ కార్యక్రమంలో పాటశాల డైరెక్టర్స్ డాక్టర్ లోహిత్ కుమార్, రాధిక గోపాలకృష్ణ, పవిత్ర లోహిత్ అకడమిక్ ఇంఛార్జి దుర్గస్తీ అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.