జగన్ కు రాజకీయ సన్యాసం తప్పదు : డాక్టర్ NB సుధాకర్ రెడ్డి
లోకేష్ పాదయాత్ర ఫలితమే MLC ల విజయం !
ఎపిలో చంద్రబాబు గాలి వీస్తోంది !
జగన్ కు రాజకీయ సన్యాసం తప్పదు
- డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి జోస్యం
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిఫలించిందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రంలో చంద్రబాబు గాలి వీస్తున్ననడానికి ఎన్నికల ఫలితాలు నిదర్శనం అన్నారు. లోకేష్ పాదయాత్ర విఫలం అయ్యిందని చెప్పిన చిత్తూరు జిల్లా మంత్రులు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. లోకేష్ తో సవాలు చేసిన నాయకులు తోక ఇప్పుడు ముడిచారని ఎద్దేవా చేశారు. చంద్రబాబును ముసలోడు అన్న జగన్ ఇప్పటికైనా ఆయనలోని చైతన్యం, పోరాట పటిమను గుర్తించాలని హితవు పలికారు.
రాష్ట్రంలో విద్యావంతులు, మేధావులు అన్ని వర్గాల ప్రజలు జగన్ కిరాతక పాలనకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. కుటిల రాజకీయాలు చేసినా కులాలను రెచ్చగొట్టినా పతనం తప్పదని జగన్ తెలుసుకుంటే మంచిదని చెప్పారు. పనికిరాని సలహాదారులను పక్కన పెట్టుకుని దోపిడీ పాలన సాగిస్తున్న జగన్ కు ఈ ఎన్నికల ఫలితాలు కనువిప్పు కావాలని సూచించారు. టిడిపి అభ్యర్ధులు ఒక్క రూపాయి ఖర్చు పెట్టక పోయినా మేధావులు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించారని చెప్పారు. మూడు పట్టభద్రుల నియోజక వర్గాల పరిధిలోని 108 అసెంబ్లీ నియోజక వర్గాలలో ప్రజల్లో తిరుగుబాటు మొదలయ్యిందని చెప్పారు. 2024లో జరిగే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడం తథ్యమని జోస్యం చెప్పారు. ఎన్నికల అనంతరం జగన్ కు రాజకీయ సన్యాసం తప్పదని చెప్పారు.