పోలింగ్ కేంద్రాల వద్ద పక్కాగా ఏర్పాట్లు
పోలింగ్ కేంద్రాల వద్ద పక్కాగా ఏర్పాట్లు
నగర కమిషనర్ డా. జె అరుణ
తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గం శాసనమండలి ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తిస్థాయిలో.. పక్కాగా.. చేపట్టాలని నగర కమిషనర్ డా. జె అరుణ నగరపాలక అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం కమిషనర్ నగర పరిధిలోని పిసిఆర్ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, బిఎస్ కణ్ణన్ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, గదులు, మరుగుదొడ్లు శుభ్రం చేయించాలని ఆరోగ్యాధికారిని ఆదేశించారు.. పోలింగ్ కేంద్రాల వద్ద బారికేడ్లు, సామియానాల ఏర్పాటు, లైటింగ్ ఏర్పాట్లు చక్కగా చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు సులభంగా అర్థమయ్యేలా మార్కింగ్ చేయాలని, హెల్ప్ డెస్క్, మొబైల్ పాయింట్లను ఏర్పాటు చేయాలని మేనేజర్, సీఎంఎం లను ఆదేశించారు. రెవెన్యూ అధికారులను సమన్వయం చేసుకొని ఎక్కడ లోపాలు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంహెచ్వో డా.లోకేష్, ఎంఈ ధనలక్ష్మీ, ఏసీపీ రామకృష్ణుడు, డీఈ వెంకట ప్రసాద్, రమణ, మేనేజర్ ఉమామహేశ్వర్ రెడ్డి, సీఎంఎం గోపి, శానిటరీ ఇన్స్పెక్టర్లు చిన్నయ్య, లోకనాథం తదితరులు పాల్గొన్నారు.