9, మార్చి 2023, గురువారం

చిత్తూరులో కత్తి పోట్లు

చిత్తూరులో కత్తి పోట్లు 

 

            ఇద్దరు వ్యక్తులు కలిసి ముగ్గురు పై కత్తులతో దాడి చేసిన ఘటన చిత్తూరు నగరం నడిబొడ్డున చోటుచేసుకుంది. గురువారం రాత్రి జరిగిన సంఘటన   వివరాల్లోకి వెళ్తే రాంనగర్ కాలనీలో నివాసం ఉంటున్న మంజుల ఎలక్ట్రికల్స్ అధినేత ప్రదీప్  చెల్లెలు జోత్స్న ఆనందబాబు అనే మరో వ్యక్తిని 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు.  బెంగళూరులో కాపురం పెట్టారు.  ఒక మగ బిడ్డ పుట్టిన తర్వాత గత కొంతకాలం క్రితం ఆమెకు ఫిట్స్ రావడంతో అనారోగ్యం కారణంగా చిత్తూరులోని రాంనగర్ కాలనీకి పుట్టింటికి ఆమె వచ్చింది. 

     

 ఈ నేపథ్యంలో ఆమెను పుట్టింటి నుండి తనతో పంపించమని ఆనందబాబు అడిగాడు.   ప్రదీప్ కుటుంబీకులు పంపించకపోవడంతో గురువారం మధ్యాహ్నం తాగేసి గొడవకు  దిగాడు.  దీంతో టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో అతని పిలిచి హెచ్చరించగా రాత్రి 7 .50 కి చర్చి వీధిలో ఉన్న మంజుల ఎలక్ట్రికల్స్ ప్రదీప్, అతని స్నేహితుడు వినోద్ దుకాణంలో పనిచేస్తున్న సురేష్ పైన ఆనంద్ బాబు అతని స్నేహితుడు సాయి కత్తులతో దాడి చేశారు. గాయపడిన  ముగ్గురిని  చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సురేష్ పరిస్థితి విషమించడంతో తిరుపతి రూరల్ ఆస్పత్రికి తరలించారు. టూ టౌన్ సీఐ మద్దయ్య చారి, ఎస్సై మల్లికార్జున కేసును నమోదుచేసి దర్యాప్తు  ప్రారంభించారు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *