విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలి
విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలి
విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని జిల్లా విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వై. శ్రీనివాస్ అన్నారు. శనివారం ఉదయం ప్రిన్సిపాల్ ఆనంద రెడ్డి తో కలసి స్థానిక పి. వి. కె. ఎన్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు అధ్యాపకులకు విద్యార్థులకు డ్రగ్స్ నివారణ, ఉపయోగించడం వల్ల కలిగే అనర్థాలు, నష్టాలు పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
అంతకు ముందు డ్రగ్స్ ను మేము వాడము, డ్రగ్స్ ను ఎవ్వరిని వాడనీయము, డ్రగ్స్ లేని జిల్లాకు మా వంతు సహాయం చేస్తామని ప్రిన్సిపాల్ ఆనంద రెడ్డి విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈకార్యక్రమంలో తిరుపతి ఎస్ వి ఆర్ ఆర్ ఆసుపత్రి , రాస్,పాస్ స్వచ్చంధ సంస్థలు నుంచి వచ్చిన ముకుందమ నాయుడు,కవిత,విభిన్న ప్రతిభావంతుల కార్యాలయపు సీనియర్ సహాయకులు,వినోద్ కుమార్,రామచంద్ర,కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు,యన్ జి ఓ లు తదితరులు పాల్గొన్నారు.