14, మార్చి 2023, మంగళవారం

సత్యవేడులో అడ్డు అదుపు లేకుండా యదేచ్ఛగా గ్రావెల్ దోపిడి


సత్యవేడులో అడ్డు అదుపు లేకుండా యదేచ్ఛగా గ్రావెల్ దోపిడి

చెన్నైకు గ్రావెల్ తరలింపు కొండంత.... బిల్లులలో నమోదు గోరంత
ప్రేక్షక పాత్ర వహిస్తున్న జిల్లా మైన్స్ శాఖ అధికారులు


             తిరుపతి జిల్లా సత్యవేడులో గ్రావెల్ తరలింపు అడ్డు అదుపు లేకుండా పోతోంది.యదేచ్చగా తమిళనాడుకు గ్రావెల్ తరలింపు కొనసాగుతోంది. తమిళనాడుకు సరిహద్దు ప్రాంతంగా ఉండడం వల్ల ఇక్కడ సహజ వనరుల దోపిడీ విచ్చలడిగా మారడం పట్ల సర్వత్ర ఆందోళన నెలకొంటుంది.గ్రావెల్ తవ్వకాలు, తరలింపులో గనులు భూగర్భ శాఖ నిబంధనలకు వారి యజమానులు తూట్లు పొడుస్తున్నారు. మండలంలోని పలు ప్రాంతాల నుంచి లక్షలాది క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తరలింపు కొండంతగా కనిపిస్తున్న సీనరేజ్ బిల్లులో మాత్రం సంబంధిత ఏజెన్సీ గోరంత (స్వల్ప పరిమాణం) నమోదు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. 

         ప్రధానంగా మండల పరిధిలోని కన్నవరం గ్రామానికి సమీపంలో రెండు గ్రావెల్ క్వారీలు,ఏఎం పురం నుంచి ఒక క్వారీ,వానెల్లూరు గ్రామం నుంచి మరొక క్వారీ నుంచి  గ్రావెల్ తమిళనాడుకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కన్నవరం గ్రామంలో సర్వే నెంబరు 386/4 లో 0.809 హెక్టార్లు 5000 క్యూబిక్ మీటర్ల మేర గ్రావెల్ తవ్వి తరలించాల్సి ఉంది. అలాగే 395/5 లో 0.404 హెక్టాలలో పదివేల క్యూబిక్ మీటర్ల మేర గ్రావెల్ తరలించడానికి జిల్లా మైన్స్ శాఖ అధికారులు అనుమతులు ఇచ్చారు. దీంతోపాటు వానెల్లూరు గ్రామం నుంచి సర్వే నెంబరు 101/2, 5,6, లో గ్రావెల్ తీయడానికి అధికారులు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇంతకాలం గ్రావెల్ తరలింపులో సీనరేజ్ సొమ్ము సక్రమంగా రావడం లేదని ప్రభుత్వం వీటిని సక్రమంగా పర్యవేక్షించి రాబట్టడానికి రాఘవ కన్స్ట్రక్షన్ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించింది. అయితే సంబంధిత ఏజెన్సీ కూడా గ్రావెల్ క్వారీ యాజమాన్యాలతో లాలూచీ పడటం వల్ల ప్రభుత్వానికి రావలసిన  సీనరేజ్ సొమ్ముకు గండి పడుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క క్వారీ నుంచి రేయంపగళ్ళు గ్రావెల్ను ట్రిప్పర్లు ద్వారా తమిళనాడుకు తరలిస్తున్నారు.
 
       ఈ క్రమంలో అధిక భాగం 12 టైర్ల టప్పర్ల ద్వారా చెన్నైకు గ్రావెల్ తరలింపు జరుగుతోంది.అయితే 12 టైర్ల ట్రిప్పలలో దాదాపు 22క్యూబిక్ మీటర్ల మేరా గ్రావెల్ తరలిస్తున్న సంబంధిత రాఘవ కన్స్ట్రక్షన్ జారీ చేస్తున్నా రవాణా సీనరేజ్ బిల్లులో మాత్రం 9 క్యూబిక్ మీటర్లు( సిబిఎం) నమోదు చేయడంలో ఆంతరమేమిటో బోధపడడం లేదు. దీంతో భారీ స్థాయిలో గ్రావెల్ క్వారీల నుంచి ప్రభుత్వానికి అందాల్సిన సీనరేజ్ సొమ్ముకు గండిపడుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా ఈ ప్రాంతంలో గ్రావెల్ తరలింపు దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్న చందాగా మారుతుంది. పైగా ప్రతిరోజు ఒక్కొక్క క్వారీ నుంచి 75 నుంచి 100 ట్రిప్పర్లు రేయంపగళ్ళు తమిళనాడుకు గ్రావెల్ తరలించడం వల్ల  జిల్లా మైన్స్ శాఖ అనుమతులు ఇచ్చిన  గ్రావెల్ పరిమాణం మించి రెట్టింపు స్థాయిలో గ్రావెల్ తవ్వేసి తమిళనాడుకు ఇష్టారాజ్యంగా తరలిస్తూ ఉండటం వల్ల లక్షల రూపాయల సొమ్ము క్వారీ యాజమాన్యాల జేబులో చేరుతున్నాయి. ముఖ్యంగా గ్రావెల్ తరలింపులో సీనరేజ్ సొమ్ము సక్రమంగా రావాలన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ జిల్లా మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్  రాఘవ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజెన్సీకి అప్పగించిన ప్రయోజనం లేకుండా పోయింది. రాఘవ కన్స్ట్రక్షన్ ఏజెన్సీ సంబంధిత గ్రావెల్ క్వారీ యాజమాన్యాలతో కుమ్మక్కు కావడం వల్లే ఈ పరిస్థితి నెలకొంటున్నట్టు ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సత్యవేడు ప్రాంతంలో  సహజ వనరులు దోపిడీ విచ్చలవిడిగా కొనసాగుతున్న సంబంధిత జిల్లా అధికారులు దీనిపై ప్రేక్షక పాత్ర వహించడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెతుతున్నాయి. 

     దీంతో గ్రావెల్ ట్రిప్పర్లు చెన్నై ప్రాంతానికి హైస్పీడ్తో పరుగులు తీస్తున్నాయి. ఓవర్ లోడ్ గ్రావెల్ తరలింపు వల్ల రోడ్లు కూడా ధ్వంసం అవుతుంది. ఇప్పటికే అలిమేలు మంగాపురం,జడేరి, అల్లప్పగుంట మార్గాల్లో తారురోడ్డుకు వేసిన కంకర లేచిపోయి అడుగుపెట్టలేని దుస్థితి నెలకొంది. కనీసం ద్విచక్ర వాహనం వెళ్లాలన్న వీలుకాకుండా పోతున్నట్టు పలురు వాహన దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ధ్వంసం అవుతున్న పంచాయతీరాజ్,ఆర్అండ్బి శాఖ అధికారులు పట్టించుకోకుండా పోవడంపై విమర్శలు లేకపోలేదు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు దీనిపై స్పందించి సత్యవేడు ప్రాంతంలో కొనసాగుతున్న సహజ వనరులు దోపిడీ అరికట్టడానికి తగు చర్యలు తీసుకోవడంతో పాటు గ్రావెల్  తరలింపులో పరిమాణానికి సంబంధించి చోటు చేసుకుంటున్న బిల్లుల మోసాలను అరికట్టాల్సి ఉంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *