1632 కర్నాటక మద్యం ప్యాక్కెట్లు స్వాదీనం
3 లక్షల విలువ గల 1632 కర్నాటక మద్యం ప్యాక్కెట్లు స్వాదీనం
గుడిపాలలో 3 లక్షల విలువ గల 1632 కర్నాటక టెట్రా ప్యాక్కెట్లు, పౌచేస్ వాహనం, ఒక Hyundai Santro కారును బుధవారం పోలీసులు స్వాదినం చేసుకున్నారు. ఒక్కరిని అరెస్టు చేశారు. చిత్తూరు పోలీసులకు ఆఅందిన సమాచారం మేరకు, చిత్తూరు రూరల్ వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్, P. శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణ లో, గుడిపాల పి.యస్.,SI K.రాజశేఖర్ రెడ్డి, ID పార్టీ సిబ్బంది నిర్వహించిన తనిఖీలో కర్నాటక రాష్ట్రం నుండి మద్యం అక్రముగా రవాణా అవుతుండగా పట్టుకున్నారు.
బుధవారం ఉదయము 06.30 గం., లకు,గుడిపాల మండలం, చిత్తూరు – వేలూరు రోడ్డు, MCR క్రాస్ రోడ్డు లో వాహనములు తనిఖీ చేయుచుండగా తమిళనాడు రాష్ట్రం వేలూరు వైపు నుండి ఒక కారు వచ్చింది. అనుమానంతో తనిఖీ చేయగావాటిలో కర్నాటక మద్యం అట్ట బాక్స్ లు, రెండు తెల్లటి సంచులలో ఉన్నాయి. విచారించగా చిత్తూరు టౌన్, వీరభద్ర కాలనీ కి చెందిన అన్సర్ మరియు గంగనపల్లికి చెందిన గణేష్ @ భోగేశ్ లు కొంత మంది డ్రైవర్ లతో కలసి గత కొంత కాలంగా కర్నాటక రాష్ట్రం నుండి మద్యం ప్యాక్కెట్లు కొని వాటిని ఎవరికి అనుమానం రాకుండా కారులలో హోసూరు మీదుగా ఆంధ్రకు రవాణా చేసి ఎక్కువ ధరకు అమ్మి సులభ మార్గం లో డబ్బు సంపాదించేవారని తేలింది. ఉదయం కారులో కర్నాటక రాష్ట్రం లో 1632 కర్నాటక టెట్రా ప్యాక్కెట్లు, పౌచేస్ కొనుగోలు చేసి, వాటిని వారి వాహనములలో లోడ్ చేసుకొనివస్తూ, పట్టుబడడం జరిగింది. అంతట మద్యం అట్ట బాక్స్ లు పరిశీలించగా సుమారు 1632 కర్నాటక టెట్రా ప్యాక్కెట్లు, పౌచేస్, వీటి విలువ సుమారు రూ. 3,00,000/-, రవాణా చేస్తున్న Hyundai santro కారు, విలువ 3,00,000/-అయిన వాహనాలనును సీజ్ చేసి, ఒక వ్యక్తిని అరెస్టు చేసి, మద్యంను స్వాదీనం చేసుకోవడమైనది. మిగిలిన పారిపోయిన ఇద్దరు వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.