27న శ్రీకాళహస్తి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ
27న శ్రీకాళహస్తి వరదరాజుస్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ
దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు
శ్రీకాళహస్తిలోని శ్రీప్రసన్న వరదరాజుస్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఏప్రిల్ 27వ తేదీన వైష్ణవ ఆగమ ప్రకారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు తెలిపారు. శ్రీకాళహస్తిలోని శ్రీ ప్రసన్న వరదరాజుల స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు కు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సుముహూర్తంపై శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ అధికారులు, వైష్ణవ ఆగమ పండితులు సమాలోచనలు చేశారు.
ఉగాది మరుసటి రోజు ఈనెల 23వ తేదీన తొలుత పున నిర్మాణ పనులకు భూమి పూజ చేయాలని భావించినప్పటికీ, వైష్ణవ ఆలయ నిర్మాణానికి వైష్ణవ ఆగమ శాస్త్రం ప్రకారం సుముహూర్తం నిర్ణయించాలని పెద్దల సూచన మేరకు టీటీడీ ఆగమ నిపుణులు పంచాంగం పరిష్కార కర్త ప్రొఫెసర్ వేదాంతం విష్ణుభట్టాచార్యులు ను సంప్రదించారు. వారు వైష్ణవ ఆగమ నిబంధన ప్రకారం వరదరాజుల స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు భూమి పూజకు ఏప్రిల్ 27వ తేదీన సుముహూర్తం ఖరారు చేశారు. ఈ మేరకు భూమి పూజ కార్యక్రమాన్ని ఏప్రిల్ 27వ తేదీన నిర్వహించనునట్లు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ప్రకటించారు.
వరదరాజుల స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు లో భాగంగా పురాతన ఆలయ పునాదులు తొలగింపు పనులను శ్రీకాళహస్తి ఆర్డిఓ రామారావు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ అంజూరు తారక శ్రీనివాసులుతో కలిసి పరిశీలన చేశారు.. తొలగిస్తున్న పురాతన రాళ్లు భద్రపరచడం నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను ఆర్డిఓ పలు కీలక సూచనలు చేశారు. దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాస్ మాట్లాడుతూ పునర్నిర్మాణ పనుల భూమి పూజ కార్యక్రమం ఏప్రిల్ 27వ తేదీ చేయనున్నందున ఈ లోపల వరదరాజు స్వామి గుడిలో వ్యర్ధాలు అన్నిటిని తొలగించి పనికొచ్చే రాళ్ళను భద్రపరిచి క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే కుప్పం నుంచి ఆలయ పునర్నిర్మాణానికి గ్రానైట్ రాళ్లను తెప్పించి శ్రీకాళహస్తి స్కిట్ కళాశాలలో శిల్పి వరకు మొత్తం చేయించి సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. భూమి పూజ అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరిగేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మున్సిపాలిటీ కమిషనర్ బాలాజీ నాయక్, దేవస్థానం ఈ ఈ మురళీధర్,డి ఈ శ్రీనివాస్ రెడ్డి, ఏఈ కిషోర్ కుమార్ సూపర్డెంట్ లోకేష్ బాబు, అనుబంధ ఆలయాల ఇంచార్జ్ లక్ష్మయ్య స్థపతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.