30, మార్చి 2023, గురువారం

వాగ్దేవి సవితా సేవాశ్రమంలో సీతారాముల కళ్యాణం

 వాగ్దేవి సవితా సేవాశ్రమంలో  సీతారాముల కళ్యాణం 


           చిత్తూరు  పెనుమూరు జాతీయ రహదారిలో వున్న వాగ్దేవి సవితా సేవాశ్రమంలో గురువారం  సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. పాంచరాత్రాగమన పద్దతిలో భద్రాచల దేవస్థానరీతిలో స్వామివారి కళ్యాణం జరిగింది. అభిజిత్ లగ్నములో జరిగిన సీతారాముల కళ్యాణమునకు పరిసర గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆశ్రమం అధినేత స్వామిని పూజానంద ఆధ్వర్యంలో సాగిన కళ్యాణానికి ఆశ్రమ ప్రధాన కార్యదర్శి హరగోపాల్ పౌరోహితులుగా వ్యవరించారు.

       ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పులికల్లు మునిరాజస్వామి, నాగరాజ, రామకృష్ణమ నాయుడు, పొన్నుస్వామి నాయుడు, మేస్త్రి గణేష్, దేవారెడ్డి, బాలకృష్ణారెడ్డి, ఆటో గిరి, పరిసర గ్రామప్రజలు, గాయత్రినగర్ మహిళాభక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉగాది పర్వదినాన ప్రారంభమైన సీతారామ వసంత నవరాత్రోత్సవాలు, ఏప్రిల్ రెండవ తేదీన పూర్ణాహుతితో ముగియనున్నవని ఆశ్రమ ప్రధాన కార్యదర్శి హరగోపాల్ తెలిపారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *