సంతోషం కంటే ఆనందం గొప్పది: సీనియర్ పిరమిడ్ మాస్టర్
సంతోషం కంటే ఆనందం గొప్పది
సంతోషం కంటే ఆనందం గొప్పదని సంతోషం మనస్సుకు సంభందించినది అయితే ఆనందం ఆత్మకు సంభందించినది అని హైదరాబాద్ కు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ బండి శ్రీనవాస్ రావు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం కాణిపాకం సమీపం లోని అరగొండ క్రాస్ సిద్దం పల్లె లో వెలసిన శ్రీ విఘ్నేశ్వర మహా పిరమిడ్ శక్తి క్షేత్రం నందు జరిగిన ఆత్మ జ్ఞాన సదస్సు లో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు.
సంతోషం తాత్కాలిక మని ఆనందం శాశ్విత మన్నారు. నిరంతర ధ్యాన సాధన ద్వారా సాస్వితమైన ఆనందాన్ని పొందవచ్చును అన్నారు. దేవతల ఆహారం శాఖాహారం అని, రాక్షసుల ఆహారం మాంసాహారం అన్నారు. మనం దేవతలతో సమానం కాబట్టి శాఖా హరమే భుజీంచాలన్నారు. చనిపోయిన ప్రాణిని బ్రతికించ లేనప్పుడు ఏ జీవిని చంపే హక్కు లేదన్నారు. ప్రకృతి నిర్దేశించిన ప్రకారం ఏ పనైనా చేయాలి గానీ దానికి విరుద్ధంగా ఏ పని చేయరాదన్నారు. తాను ఇప్పటివరకు 23 ఆధ్యాత్మిక పుస్తకాలను రచించానన్నారు. కొన్ని వందల శాఖాహార రల్లే ల్లను నిర్వహించామన్నారు.
చిత్తూరు జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరియు గ్లోబల్ స్పిరిచువల్ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ బి గోపాల కృష్ణమూర్తి మరియు ట్రస్ట్ కన్వీనర్ రాధిక గోపాలకృష్ణ వక్తలను దుస్సాలువలతో ఘనంగా సత్కరించారు. వచ్చిన ధ్యానులందరికి రుచి కరమైన శాఖాహార భోజనం అందించారు. జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో థ్యానులు పాల్గొన్నారు.


