16, మార్చి 2023, గురువారం

కొనసాగుతున్న MLC ఎన్నికల ఓట్ల లెక్కింపు

 కొనసాగుతున్న MLC ఎన్నికల ఓట్ల లెక్కింపు 


        చిత్తూరు ఆర్ వి యస్ కళాశాల నందు మూడు షిఫ్ట్ లలో ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు పట్టభద్రుల, ఉపాధ్యాయ  MLC ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. అర్థరాత్రికి ఫలితాలు వెల్లడి అయ్యే అవకాసం ఉంది.

      ఉపాధ్యాయ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది . . నేటి రాత్రికి తుది ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉంది. పట్టభద్రుల ఓట్ల లెక్కింపు కోసం సాయంత్రం 4 గం.ల సమయానికి మరో 124 బ్యాలెట్ బాక్స్ లను ఏజెంట్ ల సమక్షం లో ఓపెన్ చేయాల్సి ఉంది. కౌంటింగ్ ప్రక్రియలో రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్, చిత్తూరు యం. హరి నారాయణన్, ఎన్నికల పరిశీలకులు కాటమనేని భాస్కర్, కోనా శశిధర్ లు పర్యవేక్షణలో జరుగుతుంది. జాయింట్ కలెక్టర్ చిత్తూరు డా. యస్. వెంకటేశ్వర్, మార్కాపురం సబ్ కలెక్టర్ సేతుమాధవన్, ట్రైనీ కలెక్టర్ వై. మేఘ స్వరూప్, జిల్లా రెవిన్యూ అధికారులు చిత్తూరు ఎన్. రాజశేఖర్, తిరుపతి శ్రీనివాస రావు, నెల్లూరు వెంకట నారాయణమ్మ, ప్రకాశం ఓబులేశు, ఆర్ డి ఓ లు మదనపల్లె మురళి, నెల్లూరు మలోలా, బాపట్ల రవీంద్ర, శ్రీ కాళహస్తి కె. ఎస్.రామారావు, గూడూరు కిరణ్ కుమార్, చిత్తూరు రేణుక, పలమనేరు శివయ్య, పలు సంబంధిత జిల్లాల అధికారులు కౌంటింగ్ ప్రక్రియ లో ఉన్నారు.



 మొదటి షిఫ్ట్ ఉ.6 గం. ల నుండి మధ్యాహ్నం 2 గం. లు 

రెండవ షిఫ్ట్ మ.2 గం. నుండి రా.10 గం. ల వరకు

 మూడవ షిఫ్ట్ రా.10 గం. ల నుండి ఉ.6 గం. వరకు కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు కొనసాగనున్నది 

ఉపాధ్యాయ ఎం ఎల్ సి స్థానానికి పోలైన ఓట్లు 24,741 . .  

పట్టభద్రుల ఎం ఎల్ సి స్థానానికి పోలైన ఓట్లు 2,68,387+ రెండు స్థానాల రీ పోలింగ్ ఓట్లు 636 + పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 786 . .

ఉపాధ్యాయ ఎం ఎల్ సి ఓట్ల లెక్కింపుకు ఆర్ కె ఎం (ఆర్ వి యస్) లా కాలేజి 14 టేబుళ్ళ ఏర్పాటు 

పట్టభద్రుల ఓట్ల లెక్కింపు ఆర్ వి యస్ ఇంజినీరింగ్ కళాశాల డ్రాయింగ్ హాల్ నందు 40 టేబుళ్ళ ఏర్పాటు 

ఈ ప్రక్రియలో 193 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు 

551 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు

172 మంది మైక్రో అబ్జర్వర్లు

మొత్తం 916 మంది సిబ్బంది . . 

కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ 


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *