29, మార్చి 2023, బుధవారం

ఆదాని కుంభకోణంపై విస్తృత ప్రచారం: CPM

 ఆదాని కుంభకోణంపై విస్తృత ప్రచారం

CPM రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు పిలుపు 


              కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశ సంపదను దోచుకున్న కార్పొరేట్ శక్తులైన ఆదానీ కుంభకోణం పై చర్యలు తీసుకోకుండా మీనా వేశాలు వేయడం దారుణం అని దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని బుధవారం చిత్తూరు జిల్లా సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశం పిలుపునిచ్చింది.  ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ప్రజాస్వామ్యంను ఖూనీ చేస్తున్నదని ధ్వజమెత్తారు. 

        దేశంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ పై చిన్న కేసు విషయంలో రెండు సంవత్సరాలు జైలు  శిక్ష బడిందని కుంటిసాకుతో పార్లమెంటుకు అనర్హుడని తొలగించడం సిగ్గుచేటు అన్నారు. దేశంలో ప్రధాన 18 పార్టీలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్న రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో అధికార దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాలపై దాడి చేస్తున్నదని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో అధికారంలో ఉన్న రాష్ట్రాలపై అన్ని రకాలుగా దాడి చేస్తూ ఇబ్బందులు గురిచేస్తుంది. రాజ్యాంగాన్ని విరుద్ధంగా గవర్నర్ లను ఉపయోగించుకుంటూ రాష్ట్రాలపై పెత్తనం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా జరుగుతున్న విస్తృత ప్రచారంలో చిత్తూరు జిల్లాలో కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.      

         సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై జిల్లాలో ప్రస్తుత ప్రచారం నిర్వహించి పోరాటాలకు సిద్ధమవుతున్నామని ఆయన తెలిపారు. జిల్లాలో ఉన్న ప్రజా సమస్యలపై సిపిఎం పోరాటాలకు సిద్ధమవుతున్నదని ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో  ఎండల తీవ్రత పెరిగిందని గ్రామీణ ప్రాంతాల్లో మరియు మున్సిపాలిటీలో  తాగునీటి సమస్య రాబోతున్నది. దీనిపై ముందు జాగ్రత్త చర్యలు అధికారులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు కే సురేంద్రన్ అధ్యక్షత వహించగా ఓబుల్ రాజు, గిరిధర్గుప్త ,భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *