కాణిపాకం టోల్గేట్ నిధుల్లో 80% ఆలయానికి
కాణిపాకం టోల్గేట్ నిధుల్లో 80% ఆలయానికి
పంచాయితీ ద్వారా నిర్వహించి టోల్గేట్ నిధుల్లో 80% ఆలయానికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కాణిపాకం పాలకమండలి తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. శనివారం కాణిపాకం దేవస్థానం పాలకమండలి సర్వసభ్య సమావేశం చైర్మన్ నగరం మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలయ ఈవో ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈవో వెంకటేష్ చైర్మన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాణిపాకం ఆలయ పరిసర ప్రాంతాలు పార్కింగ్ స్థలాలు పూర్తిగా ఆలయానికి సంబంధించింది అయినందువలన వాటి పారిశుద్ధ్య నిర్వహించే బాధ్యత ఆలయాధికారులే చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆలయానికి టోల్గేట్ నిధుల నుండి 80% వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని పాలకమండలి ఆమోదం తెలిపినట్లు తెలిపారు. అలాగే ఆలయానికి సంబంధించి అగరం పల్లె నుండి వంద అడుగుల రహదారి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి పూర్తిగా ఆలయ నిధులు వెచ్చిచ్చినట్టు తెలిపారు. అలాగే ఆలయ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సిబ్బంది కొరత లేకుండా అన్ని విభాగాల్లో నూతనంగా పోస్టుల భర్తీ చేసేందుకు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఆమోదం కోసం కమిషనర్ కు పంపడం జరిగిందన్నారు ఆలయంలో మాస్టర్ ప్లాన్ దృష్టిలో ఉంచుకొని మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు చైర్మన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. దినదినాభివృద్ధి చెందుతున్న ఆలయాన్ని సందర్శించేందుకు వివిధ రాష్ట్రాలు దేశాల నుండి కూడా భక్తులు తరలివస్తున్నందున వారికి సరైన వసతులు కల్పించడం అన్ని సేవల్లో పాల్గొనే విధంగా ఏర్పాటు తీసుకొస్తున్నట్లు తెలిపారు. నూతనంగా పలు సేవల్ని కూడా ప్రవేశపెట్టినట్లు ఈవో వెల్లడించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ఆలయ అధికారులు ఎక్స్ అఫీషియల్ సభ్యులు సోమశేఖర్ గురుకుల్ తదితరులు పాల్గొన్నారు.