20, మార్చి 2023, సోమవారం

TDP శ్రేణుల, పోలీసుల మధ్య తోపులాట

 TDP శ్రేణుల, పోలీసుల మధ్య తోపులాట

మొలకల చెరువులో ఉద్రిక్తత

                     

            ములకలచెరువు రైల్వే క్రాస్ వద్ద లోకేష్ ఫోటోకి శనివారం చెప్పులు హారం వేసిన వైసీపీ నాయకుల తీరును నిరసిస్తూ నేడు ములకలచెరువు లో జాతీయ రహదారిపై తెలుగుదేశం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం శ్రేణులు మాట్లాడుతూ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పక్క నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారని, వైసీపీ నాయకులకు ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే మా నాయకున్ని టచ్ చేయండని సవాల్ విసిరారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మూడు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపును ఓర్వలేని వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి వాళ్లకు మాత్రమే ఎన్నికల కోడ్ వర్తిస్తుంది వైసిపి వాళ్లకు అవి వర్తించవా అని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పోలీసులు తీరుపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *