డిల్లీ మద్యం కుంభకోణం ఎలా జరిగింది?
ప్రభుత్వానికి నష్టం, వ్యాపారస్తులకు లాభం వచ్చేలా పాలసీని ఎలా మార్పు చేశారు?
ఢిల్లీ మద్యం కుంభకోణం ఇప్పడు తెలుగు రాష్ట్రాలను, డిల్లీ రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. అన్నా హజారే స్థాపించిన అవినీతి వ్యతిరేక ఉద్యమం నుండి అప్ పార్టీ ఆవిర్భవించింది. అవినీతిని చిపురుతో ఊడ్చి పారేస్తానని కేజివాల్ డిల్లీలో అధికార పీటం ఎక్కారు. అవినీతిని పారద్రోలడం అటుంచి, ఆ ప్రభుత్యం అవినీతి ఊబిలోకి ఎలా కురుకుపోయిందో చుడండి.
పారదర్శకమైన ఢిల్లీ పాత మద్యం పాలసీ.
750ML టోకు ధర ₹166.73
ఎక్సైజ్ డ్యూటీ ₹223.88
VAT ₹106.00
రిటైలర్ కమీషన్ ₹ 33.39
MRP ₹530.00
కేజ్రీవాల్ కొత్త గా 2022 లో అమలు చేసిన మద్యం పాలసీ
750ML టోకు ధర ₹188.41
ఎక్సైజ్ డ్యూటీ ₹ 1.88
VAT:1%₹1.90
రిటైలర్ మార్జిన్ ₹ 363.27
అదనపు ఎక్సైజ్ ₹4.54
MRP ₹560.00
ఇలా పాత మద్యం పాలసీలో ఒక సీసాపై ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 329.89, వస్తుంటే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి, కొత్త మద్యం పాలసీలో 8.32 మాత్రమే లాభం వస్తున్నది. అంటే ఒక్క 750ml బాటిల్ పై కొత్త పాలసీ వల్ల ప్రభుత్వానికి ఒక్కో 750 ML బాటిల్ పై ₹321.57నష్టం వస్తున్నది. పాత పాలసీలో రిటైలర్ కమీషన్ 33.39 లాభం. అయితే కొత్త పాలసీలో రిటైలర్ కమీషన్ కొన్ని నెలలకు రూ. 363.27, అంటే రిటైలర్‌కు ఒక్కో బాటిల్‌కు ₹ 330.12 లాభం. 12750ml బాటిల్స్ ఉన్న ఒక ప్యాకెట్ Rs:9000/- మొత్తం రేటు, దీనిలో లాభం దీనిలో ఈ సిండికేట్ కి లాభం Rs:3960/-. ఈ సేల్స్ ఒక్క సంవత్సరానికి ₹4500 కోట్లు. ఈ టెండర్ 4 సంవత్సరాలు అంటే Rs :45004=18000 కోట్లు సేల్స్. దీనిలో ఈ రిటైలర్ లాభం Rs:2160. ఈ మొత్తం ఢిల్లీ ప్రభుత్వానికి లిక్కర్ సేల్స్ మీద రెవెన్యూ నష్టం. అదిరిపోయే స్కీమ్ ఎం కాదు. ప్రభుత్యానికి భారీ నష్టం. చిల్లర వర్తకులకు భారీ ప్రయోజనం చేకూర్చినట్లు స్పష్టమవుతోంది. సుసు & కేజు అనే తెలివిగల కొత్త పాలసీని రూపొందించడం ద్వారా తయారీదారులు/చిల్లర వ్యాపారులకు ఎంత ప్రయోజనం చేకూరిందో ఆలోచిస్తే తెలుస్తుంది.
నిబంధనలు ఎలా మార్చారో చూడండి
1.ఇప్పుడు ఈ ప్రయోజనం తయారీదారుకు ఎలా చేరింది, కొత్త విధానంలో, తయారీదారులు రిటైల్‌లో దుకాణాలను తెరవడానికి అనుమతించారు. నిబంధనల ప్రకారం ఇది తప్పు.
2.ఈ సేల్‌ను పెంచడానికి, తాగే వయస్సు 18 సంవత్సరాలకు తగ్గించబడింది. ఉదయం 3 గంటల వరకు సమయం పెంచబడింది.
3. డ్రైడేస్‌ను 31 నుండి 3 రోజులకు తగ్గించారు. తద్వారా మద్యపానం గరిష్టంగా పెరుగుతుంది. ఏరులై పారుతుంది, పేదవారి జీవితాలు అల్లకల్లోలమౌతాయి.
ఇది ఎంత పెద్ద కుంభకోణమో, సుసు & కేజు కాకస్ ఎంత డబ్బు సంపాదించిందో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. దీని కారణంగానే చీఫ్ సెక్రటరీ సిబిఐ విచారణకు ఎల్‌జిని అడగవలసి వచ్చింది. రాజకీయాల నుంచి అవినీతిని రూపుమాపుతామంటూ అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన పార్టీ పరిస్థితి ఇది. జనం తాగి తాగి చావని, మాకేం అని బరితేగించారు. ప్రభుత్వానికి ఆదాయం రాకున్న, ఇబ్బంది లేదు. వ్యాపారస్తులకు మాత్రం దండిగా లాభాలు రావాలి. ఆ లాభాల్లో తమకు వాటా ఇవ్వాలి. మనకు సంపాదించుకునే అవకాశం వచ్చింది. ప్రజల ఓట్లు వేసి దోచుకోమని అవకాశం ఇచ్చారని ఫీల్ అయ్యే రాజకీయ కుటుంబ పార్టీలు ఉన్నంత కాలం ఈ సమాజంలో మార్పు వస్తుందా?