13, మార్చి 2023, సోమవారం

అరవ తరగతి చదివితే గ్రాడ్యుయేట్ !



 అరవ తరగతి చదివితే గ్రాడ్యుయేట్ !

పార్టీ కార్యాలయాలకు, ఖాలీ ప్లాట్లకు ఓట్లు 

ఒకే మహిళకు 21 మంది భర్తలు 

ఒకే డోర్ నెంబర్ పై 40 దొంగ ఓట్ల

                  


           జగనన్న పాలనలో, వాలంటీర్ల రాజ్యంలో సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఆరవ తరగతి చదివినా  గ్రాడ్యుయేట్స్ అయిపోయరు. ఒకే మహిళకు 21 మంది భర్తలు పుట్టుకు వచ్చారు. ఖాలీ ప్లాట్లలో కూడా ఓట్లు నమోదు అవుతున్నాయి. పార్టీ కార్యాలయాల్లో కూడా ఓటర్లు నివాసం ఉంటున్నారు. ఒకే  డోర్ నెంబర్ లో 40 ఓట్లు కూడా నమోదు అవుతున్నాయి. ప్రైవేటు ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా అవతారమేత్తారు. ఎన్నికలలో అక్రమాలకు సహకరించని జిల్లా విద్యాశాఖ అధికారులపై బదిలీ వేటు పడింది. ఇలాంటి చిత్ర విచిత్రాలు ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కనిపించదు. ఎమ్మెల్సీ ఎన్నికలలో గ్రాడ్యుయేట్ల స్థాయిని కూడా తగ్గించారు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల నమోదు ఓటింగ్ ప్రక్రియలో, ఓటింగ్ లో రికార్డు స్థాయిలో అవకతవకలు వెల్లువేతాయి.  

        ఎమ్మెల్సీ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చుట్టాలుగా మారాయి. పోలింగ్ బూత్లలో రిగ్గింగులు జరిగాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యదేచ్చగా చరబడ్డారు. ఇదేమని అడిగిన టిడిపి, ఇతర ప్రతిపక్ష నాయకుల అదుపులోకి తీసుకున్నారు. పిడుగులు గుద్దులు గుద్దారు. కేంద్రాల పరిసరాల్లో  కూడా కరెన్సీ నోట్ల పంపిణీ యదేచ్చగా  కొనసాగింది. మంత్రులే ఓటుకు వెయ్యి రూపాయలు ఇవ్వాలని వాలంటీర్లకు దశ నిర్దేశం చేశారు. చిత్తూరు జిల్లాలో ఉపాధ్యాయులకు ఒక్కొక్కరికి 5000 రూపాయల వంతెన కవర్లలో  సమర్పించుకున్నారు. చిత్తూరు కెసిఆర్ కళాశాలలో పోలింగ్ సమయంలో వేలిముద్రలతో ఓట్లు వేశారని ఆరోపణలు వచ్చాయి. ఓటర్ల నమోదులో కూడా భారీగా అవకతవకలు, ఆశ్రిత జన పక్షపాతం చోటు చేసుకుంది. ఓటర్ల అక్రమాల గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తినా, వాటి గురించి పట్టించుకోలేదు. ఎన్నికల అయిన తర్వాత సాఫీగా వాటిపైన విచారణ జరిపి చర్చలు తీసుకుంటామని దర్జాగా హామీలు గుప్పించారు. మొత్తం ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేసే విధంగా పట్టభద్రుల, ఉపాద్యాయ ఎన్నికలలో దారుణాలు చోటుచేసుకున్నాయి.

        తిరుపతిలో ఒక మహిళకు 21మంది భర్తలు ఉన్నట్లు సృష్టించి ఓట్లు నమోదు చేశారన్నారు CPI నారాయణ ఫిర్యాదు చేశారు. యశోద నగర్ లోని ఖాళీ స్థలంలో 11 ఓట్లు నమోదు నమోదు చేసారని, తిరుపతి నగరంలో 7వేల దొంగ ఓట్లున్నాయని ఆరోపించారు. వెంటనే ఈ బోగస్ ఓట్ల విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  తిరుపతి వైఎస్సార్‌సీపీ పడమటి కార్యాలయం చిరునామాతో 36 దొంగ ఓట్లను నమోదు చేశారని, వాలంటీర్ ఇంటిలో 22ఓట్లు నమోదు చేయించారన్నారు.  6, 7వతరగతి చదివిన వారు సర్టిఫికెట్ ఫోర్జరీతో పట్టభద్రుల ఓటు హక్కును పొందారని.. ఒకే డోర్ నెంబర్ పై 40 దొంగ ఓట్లను ఎలా నమోదు చేశారని ప్రశ్నించారు. స్టాంపులను తయారు చేసి అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి దొంగ ఓట్లను నమోదు చేశారని.. వైఎస్సార్‌సీపీ నేతలే దొంగ ఓట్లను నమోదు చేయించారని.. ఎలక్ట్రికల్ ఏఈ ధృవీకరణ సంతకంతో 270దొంగ ఓట్లను నమోదు చేశారన్నారు.

       ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తిరుపతిలో భారీగా దొంగ ఓట్లు ఉన్నాయని టీడీపీ నేతలు  పోలీసులను ఆశ్రయించారు. రాతపూర్వకంగా వెస్ట్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆధారాలతో సహా దొంగ ఓట్లను ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పోలీసులకు వివరించారు. తిరుపతిలో 7వేల దొంగ ఓట్లున్నాయని పోలీసులకు ఆధారాలు చూపించామన్నారు.  దొంగ ఓటర్ల వాయిస్ రికార్డులను పోలీసులకు అందించామని.. 229 బూత్ లో ఒకే ఇంటి చిరునామాతో వాలంటీర్ 22దొంగ ఓట్లను నమోదు చేయించారన్నారు.

      నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని రామ్మూర్తి నగర్ ప్రైమరీ స్కూల్‌లోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, సీఐ రాములు నాయక్ మధ్య వాగ్వాదం జరిగింది.   ఇక ప్రొద్దుటూరులో బహిరంగంగానే ఓటర్లకు డబ్బులు పంచడం దుమారం రేపింది. అలాగే తిరుపతి జీవకోన ఏరియాలో బూత్‌ నెంబర్‌ 233, 234లో నకిలీ ఓటర్లు ఓటు వేయడానికి రావడంతో ఘర్షణ జరిగింది. ఓటర్లను ప్రశ్నించినప్పుడు పదో తరగతి చదువుకుంటున్నామని చెప్పారు. దీంతో అధికార పార్టీ నకిలీ ఓటర్లను చేర్పించినట్లు స్పష్టంగా రుజువైందని సీపీఎం ఆరోపిస్తోంది. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *