9, మార్చి 2023, గురువారం

మహిళల హక్కుల కోసం వందేళ్ల క్రితమే పోరాడిన తొలి విప్లవ వీర నారి

మహిళల హక్కుల కోసం వందేళ్ల క్రితమే పోరాడిన తొలి విప్లవ వీర నారి 

నేడు సావిత్రిబాయి పూలే వర్ధంతి


           చదువు ప్రాధాన్యాన్ని వివరించిన గొప్ప సంఘసేవకురాలు సావిత్రిబాయి ఫూలే... మహిళల హక్కుల కోసం వందేళ్ల క్రితమే పోరాడిన తొలి తరం మహిళా ఉపాధ్యాయురాలు, రచయిత్రి... భారతదేశ చరిత్రలోనే సామాజిక విప్లవకారుడిగా ఘనతకెక్కిన జ్యోతిబా ఫూలే సతీమణే "సావిత్రిబాయి పూలే" కులమతాల పేరుతో తరతరాలుగా అణచివేతకు గురైన నిమ్నజాతి ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడిన మహనీయుడు మహాత్మ జ్యోతిభాపూలే అర్థాంగి ఆమె. భర్తకు తగ్గ భార్యగా సావిత్రి కూడా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. భారతదేశంలో మహిళా విద్యకు పెద్దపీట వేస్తూ, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన స్త్రీలు చదువుకొనేందుకు ఆమె పాఠశాలలు సైతం ప్రారంభించారు. ఆమె విప్లవ ప్రసంగాలు ఆనాటి మహిళల్లో ఎందరికో స్ఫూర్తిని కలిగించాయి.

       నిమ్న వర్గాల అభ్యున్నతికి  సావిత్రిబాయి పూలే కృషి చేశారు.  ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు భావించారు. అహ్మద్ నగర్‌లో ఉపాధ్యాయ శిక్షణ పొంది 1848 మే 12న భర్తతో కలిసి కింది కులాల బాలికల కోసం పూణేలో మొదటి బహుజన పాఠశాలను ప్రారంభించారు. కేవలం నాలుగేళ్లలోనే గ్రామీణ ప్రాంతాల్లో 27 పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యనందించారు. తన జీవిత కాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు, మానవ హక్కులు, ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్య పరచడానికి 1852 లో మహిళా సేవామండల్‌ అనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించారు. 

       సావిత్రీబాయి 3 జనవరి 1931 తేదిన మహారాష్ట్రలోని సతారాజిల్లా నాయగాఁవ్ గ్రామంలో జన్మించారు. తొమ్మదివ యేటనే తమ కుటుంబ సంప్రదాయం ప్రకారం 12 ఏళ్ళ జ్యోతిభాపూలేను ఆమె వివాహం చేసుకున్నారు. పాఠశాలలో కేవలం కొన్ని కులాల పిల్లలకే పరిమితమైన రోజుల్లో.. జ్యోతిభాపూలే నిమ్నజాతుల  పిల్లల కోసం పాఠశాలలు స్థాపించారు. ఆ తర్వాత సావిత్రిబాయి మహిళల కోసం ఒక ప్రత్యేక పాఠశాలను స్థాపించారు. ఆ విధంగా ఆమె భారతదేశంలో స్థాపించబడిన మొదటి మహిళా పాఠశాలకి అధ్యాపకురాలిగా చరిత్రపుటల్లో స్థానం సంపాదించుకున్నారు. కులాలకతీతంగా దేశంలో అనాథపిల్లల పట్ల అందరూ అక్కర చూపాలనే భావనను ప్రచారం.. తాము సైతం చనిపోయిన ఓ బ్రాహ్మణ యువతి కుమారుడిని దత్తత తీసుకున్నారు. 

          నిరక్షరాస్యురాలిగా ఉన్న ఆమెకు భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు. ఆయన ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. 1873 లో తన భర్త మహత్మా పూలేతో కలసి సత్యశోధక్ సమాజ్‌ను ప్రారంభించి బాల్యవివాహలకు, మూఢనమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేకంగా, వితంతు పునర్వివాహాలు కోసం బలమైన ఉద్యమం నడిపారు. తరువాత 1873 సెప్టెంబరు 24న ‘‘సత్యశోధక్‌ సమాజ్‌’’ అనే సామాజిక, ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి, సత్యాన్ని శోధించడానికి ఉద్యమాన్ని నడిపారు. 1870లో ఒకసారి 1896లో మరోసారి దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు ఫూలే దంపతులు చేసిన కృషి అనన్య సామాన్యం. కరువు వాతపడిన కుటుంబాలలోని అనాధ బాలలను దాదాపు 3,000 మందిని అక్కున చేర్చుకున్నారు. తమ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించినారు. 

            1890 నవంబరు 28 తేదిన జ్యోతిభాపూలే మరణించిన సమయంలో.. తన భర్తకు తానే స్వయంగా చితిపెట్టి మరో విప్లవానికి తెరలేపారు సావిత్రి. అలాగే ఆమె భర్త చనిపోయాక.. తన బొట్టు తీయలేదు.. అలాగే శిరోముండనం చేయించుకోలేదు. దళిత, ఆదివాసీ, గిరిజన, మైనారిటీ కులాల మహిళల ఐక్యతకోసం పాటుబడిన సావిత్రిబాయి తన పాఠశాలల్లో అన్ని మతాలకూ చోటు కల్పించేవారు. ఆమె పాఠశాల ద్వారే ఫాతిమాషేక్ అనే యువతి తొలి ముస్లిం మహిళా అధ్యాపకురాలుగా చరిత్రకెక్కడం గమనార్హం. తన భర్త చితికి తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. దేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇది. 

       ఫూలే మరణానంతరం సత్యశోధక్ సమాజ్ బాధ్యతనీ స్వీకరించి నడిపించింది. 1897 లో ప్లేగు వ్యాధి, పూణే నగరాన్ని వణికించింది. నగరమంతా ఎడారిగా మారింది. జనమంతా దగ్గర్లోని అడవుల్లోకి పారిపోయారు. సావిత్రీబాయి పూలే తన కుమారుడు యశ్వంత్‌తో కలిసి వ్యాధిగ్రస్తులకు సేవ చేసారు. 1896-97లో సంభవించిన తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని దళితులకు, పేదలకోసం ఆమె జోలెపట్టి విరాళాలు సేకరించి అందించారు. ప్లేగు వ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలందించారు. 1890 వ దశకంలో ప్లేగు వ్యాధి బారినపడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించారు. ప్లేగు వ్యాధి సోకిన దళిత చిన్నపిల్లలని తన చంకన వేసుకొని చికిత్స చేసి కాపాడారు. చివరికి ఆ ప్లేగు వ్యాధే ఆమెకు సోకి 1897 మార్చి 10న మరణించారు.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *