11, మార్చి 2023, శనివారం

జిల్లాలో ఇంటర్, పదవ తరగతి పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాటు

జిల్లాలో ఇంటర్, పదవ తరగతి పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాటు 

జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ 


          మార్చి 15 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలు,మరియు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. ఎస్.జవహర్ రెడ్డి కోరారు. శనివారం అమరావతి  నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లు,  జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్  ద్వారా ఇంటర్మీడియట్ మరియు పదవ తరగతి పరీక్షల నిర్వహణ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఈనెల 15 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని పరీక్షల ప్రారంభానికి ఒక గంట ముందే విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించాలనన్నారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు నిరంతర విద్యుత్ తో పాటు బల్లలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలనన్నారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ వారు బస్సుసౌకర్యo కల్పించాలని తెలిపారు. 

       ఆర్టీసీ వారు వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి, తిరిగి వారి ఇండ్లకు చేరుకోవడానికి బస్సు సౌకర్యం కల్పించాలనన్నారు.  పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన మంచినీరు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు తప్పనిసరిగా అందుబాటు లో ఉంచాలనన్నారు. వైద్య సిబ్బంది తోపాటు అవసరమైతే విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్నచోట అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేయాలనన్నారు. పరీక్షా కేంద్రంలోనికి సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదనన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా పరీక్ష పూర్తి అయిన తర్వాత ఆ ప్రశ్నాపత్రాలు జవాబు పత్రాలను నిర్దేశించిన ప్రాంతాలకు చేరవేసేందుకు పోస్టల్ అధికారులు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే కంట్రోల్ రూమ్ 18004257635 కు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు.

      వీడియో కాన్ఫరెన్స్ కు చిత్తూరు జిల్లా నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్ వివరిస్తూ... చిత్తూరు జిల్లాలో ఇంటర్ విద్యార్థులు మొత్తం 31,576 మంది పరీక్షకు హాజరుకానున్నారని, 50 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్ష కేంద్రంలో ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని,ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు, పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు జరుగుతాయని, 21,996 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తారని,ఈ  పరీక్షల నిర్వహణ కు అన్ని ఏర్పాట్లు చేస్తామని జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *